
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి
జగిత్యాల: అన్నివర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, పట్టణ అభివృద్ధికి ఎళ్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో బుధవారం అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బల్ది యాకు రూ.50కోట్లు, డబుల్‌బెడ్ రూం ఇళ్లకు రూ.20 కోట్లు మంజూరయ్యాయని, రూ.4 కోట్లతో మార్కెట్ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు మహిళాసంఘాల ద్వారా రూ.లక్ష రుణం ఇచ్చే అవకాశం ఉందని, దీనిని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగభూషణం, కోరుట్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి నర్సింగరావు, అడువాల జ్యోతి, సుధాకర్, శంకర్, అల్లె గంగసాగర్, పద్మజ, ధర్మరాజు, సమిండ్ల శ్రీను పాల్గొన్నారు.
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్