ముగిసిన డీడీఎన్‌ ఆలయాల ఎంపిక పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ముగిసిన డీడీఎన్‌ ఆలయాల ఎంపిక పరిశీలన

Jul 9 2025 6:51 AM | Updated on Jul 9 2025 6:51 AM

ముగిసిన డీడీఎన్‌ ఆలయాల ఎంపిక పరిశీలన

ముగిసిన డీడీఎన్‌ ఆలయాల ఎంపిక పరిశీలన

కరీంనగర్‌ కల్చరల్‌: ప్రతీగ్రామంలో ఒక ఆలయానికి నిత్యం దీపదూపాలు నిర్వహించాలనే ఉద్దేశంతో 2007లో వైఎస్సార్‌ హయంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం డీడీఎన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా ఉమ్మడి జిల్లాలోని ఆలయాలకు దూపదీప నైవేద్య పథకం వర్తింపజేసేందుకు దేవాదాయశాఖ మే1న నోటిపికేషన్‌ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో 317 దరఖాస్తులు రాగా.. ఎంపిక పరిశీలన ఇటీవలే ముగిసింది. ప్రతి తీ జిల్లాలో దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీతో చర్చించి, సభ్యులతో సంతకాలు చేయించి, ఆమోదం పొందిన తరువాత జాబితాను దేవాదాయశాఖ కమిషన్‌ కార్యాలయానికి పంపించనున్నారు. ఉమ్మడి జిల్లా దేవాయశాఖ సహాయ కమిషనర్‌, ఎండోమెంట్‌ ఇన్స్‌పెక్టర్లు, ఇద్దరు సీనియర్‌ ఈవోలు, రెగ్యులర్‌ అర్చకుల నుంచి ఒకరు, డీడీఎన్‌ అర్చకుల నుంచి ఇద్దరు కమిటీగా దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ నిర్మాణం చేపట్టి 15ఏళ్లు పూర్తయ్యిందా..? డీడీఎన్‌ నిబంధనల మేరకు ఉన్నాయా అని పరిశీలించారు. ‘డీడీఎన్‌ ఆలయాల ఎంపిక పరిశీలన ముగిసింది. ప్రతీ జిల్లాలో దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీ సంతకాల స్వీకరణ తరువాత జాబితా దేవాదాయ కమిషనర్‌కు పంపిస్తాం’ అని దేవాదాయశాఖ ఉమ్మడి జిల్లా సహాక కమిషనర్‌ నాయిని సుప్రియ వివరించారు.

ఉమ్మడి జిల్లాలో డీడీఎన్‌ దరఖాస్తుల వివరాలు

జిల్లా ప్రస్తుత వచ్చిన

ఆలయాలు దరఖాస్తులు

కరీంనగర్‌ 256 100 పెద్దపల్లి 153 69

రాజన్న సిరిసిల్ల 167 42

జగిత్యాల 322 106

మొత్తం 898 317

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement