
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాలరూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాలరూరల్ మండలం గొల్లపల్లిలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ.2 లక్షలతో నిర్మించే డ్రైనేజీ, ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేశారు. గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈవో గాయత్రి, ఏఈ రాజమల్లయ్య, మాజీ సర్పంచ్ ప్రకాశ్, మాజీ జెడ్పీటీసీ ఎల్లారెడ్డి, నాయకులు సదాశివరావు, బాలముకుందం, శంకర్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
జగిత్యాల: అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో అమృత్ 2.0 పథకం కింద రూ.2.50 కోట్లతో నిర్మిస్తున్న రూ.15 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ట్యాంక్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు.