
వృత్తి నైపుణ్యం సాధించాలి
● ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం: విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సాధించాలని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లాస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరంతరం విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కంప్యూటర్, ఫోరెన్సిక్, ఫింగర్‌ప్రింట్, హ్యాండ్లింగ్, పోలీస్ జాగిలాల విభాగంలో ట్రాకింగ్, ఎక్స్‌ప్లోజివ్, ఫొటో, వీడియోగ్రఫీలో పోటీలు ఉంటాయన్నారు. సాంకేతిక పరి జ్ఞానం, కేసుల దర్యాఫ్తులో మెలకువలు నేర్చుకునేందుకు డ్యూటీ మీట్ దోహద పడుతుందన్నారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర, జాతీయస్థాయిలో జరిగే డ్యూటీ మీట్‌కు ఎంపిక చేస్తామని తెలిపారు. అడిషనల్ ఎస్పీ భీంరావు, డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్, రాములు, సీఐలు శ్రీనివాస్, రఫీ ఖాన్, శ్రీధర్, సుధాకర్, కరుణాకర్ పాల్గొన్నారు.