పిల్లల చేయిపట్టి.. సర్కార్ బడికి జైకొట్టి
● ప్రభుత్వ పాఠశాలకు పంతుళ్ల పిల్లలు ● నమ్మకం కల్పిస్తున్న టీచర్లు
● స్ఫూర్తి పొందుతున్న తల్లిదండ్రులు ● సర్కార్ స్కూళ్లలో పెరుగుతున్న ప్రవేశాలు
తాము పనిచేస్తున్న సర్కార్ స్కూళ్లపై నమ్మకం పెంపొందించడం.. విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా టీచర్లు తమ పిల్లలను తమతో పాటే తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ కొలువు చేస్తూ ప్రైవేట్ స్కూళ్లకు పంపడం సరికాదని.. సర్కార్ స్కూళ్లలో చేర్పించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని.. ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన సాగుతోందంటూ టీచర్లు చాటిచెబుతున్నారు. పిల్లలను తాము పనిచేస్తున్న స్కూళ్లకు తీసుకెళ్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు.
కథలాపూర్(వేములవాడ): మండలంలోని దుంపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న లింగంపేట సతీశ్ తన కొడుకు వరుణ్‌తేజ్ అదే స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నారు.
కోనరావుపేట: కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన తీపిరి సంజీవ్ స్థానిక మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నారు. తన కుమారుడు జయసూర్యని కూడా అదే పాఠశాలలో రెండో తరగతి చదివిస్తున్నారు. ప్రతి రోజూ తండ్రీకొడుకులు బైక్‌పై స్కూల్‌కు వెళ్లి వస్తున్నారు.