
చికిత్స పొందుతూ వలసజీవి మృతి
● ఈనెల 3న గల్ఫ్ వెళ్లేందుకు ఏర్పాట్లు
● అంతలోనే కుటుంబంలో విషాదం
కథలాపూర్: మండలంలోని దుంపేటకు చెందిన పాట్కురి ప్రతాప్‌రెడ్డి (58) గతనెల 28న మెట్లపై నుంచి పడి గాయపడగా.. చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందినట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. ప్రతాప్‌రెడ్డి ఈనెల 3న మస్కట్ దేశం వెళ్లాల్సి ఉంది. అంతలోనే మృత్యువాతపడటంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం దుంపేటకు చెందిన ప్రతాప్‌రెడ్డి కొన్నాళ్లుగా మస్కట్ వెళ్లి వస్తున్నాడు. నాలుగు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చారు. తిరిగి ఈనెల 3న మస్కట్ వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈ క్రమంలో జూన్ 28న ప్రతాప్‌రెడ్డి తన ఇంటిపై నుంచి మెట్ల ద్వారా దిగుతుండగా.. జారిపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రతాప్‌రెడ్డికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుమారుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ వివరించారు.