
విద్య వ్యాపారం కాదని..
సారంగాపూర్: ప్రస్తుతం విద్యను వ్యాపారం చేశారని.. కాదని చెప్పేందుకే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిపిస్తున్నట్లు గొడుగు మధుసూదన్ తెలిపారు. బీర్‌పూర్ మండలం నర్సింహులపల్లికి చెందిన మధుసూదన్ కండ్లపల్లిలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పెద్ద కుమార్తె నిత్య 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రస్తుతం ఇంటర్మీడియట్‌లో చేరింది. చిన్న కూతురు శ్రీనిధి నర్సింహులపల్లిలో ని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కండ్లపల్లిలో విధులు నిర్వహిస్తూనే నర్సింహులపల్లిలోని స్కూల్‌కు వెళ్లి అదనంగా ఒక పీరియడ్ బోధిస్తున్నారు మధుసూదన్.