
బోధనపై నమ్మకంతో..
వేములవాడ: కథలాపూర్ స్కూల్‌లో పనిచేస్తున్న టీచర్ కిష్టయ్య తన కూతురు మధురిమను వేములవాడలోని బాలికల హైస్కూల్‌లో చేర్పించారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందనే చేర్పించినట్లు కిష్టయ్య పేర్కొన్నారు.
జమ్మికుంట: ప్రభుత్వ పాఠశాలలో బోధనపై నమ్మకం కల్పించేందుకు తన కుమారుడిని చేర్పించినట్లు టీచర్ బానోత్ సత్యజోస్ తెలిపారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లిలోని స్కూల్‌లో సత్యజోస్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జమ్మికుంటలో ఉంటున్నారు. ఏడాది క్రితం బదిలీపై పర్లపల్లి పాఠశాలకు వచ్చారు. తన కొడుకు బానోతు సుశాంత్‌ను జమ్మికుంట హైస్కూల్‌లో 9వ తరగతిలో చేర్పించారు.