
నాన్న వెంటే పిల్లలు
కరీంనగర్‌స్పోర్ట్స్: తాము పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను తీసుకెళ్తున్నారు ఈ తండ్రులు. వీరిని చూసి గ్రామంలోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను సర్కార్ బడులకు పంపుతున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన సత్యనారాయణ ప్రస్తుతం వేములవాడలోని జెడ్పీ హైస్కూల్(బాలికలు)లో విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా సంక్షోభానికి ముందు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ పిల్లలనూ అక్కడే చదివిపించేవారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో తాను పనిచేస్తున్న స్కూల్‌కే తన పిల్లలను తీసుకెళ్తున్నారు. పెద్ద కూతురు అనన్య ప్రభాస 8వ తరగతి, చిన్నకూతురు ప్రవస్థి 5వ తరగతి చదువుతున్నారు.