
పరిహారం.. పరిహాసం!
● విద్యుత్ షాక్ బాఽఽధితుల దయనీయ పరిస్థితి ● ప్రాణాలు పోయినా పట్టింపు కరువు ● గాయపడిన వారిని ఆదుకునేదెవరు ● ప్రయివేటులో అడ్డగోలు ఖర్చులు
ఈమె పేరు పూజిత. పక్కన ఆమె కుమారుడు సాత్విక్(6). ఏడాదిన్నర క్రితం కోరుట్ల కల్లూర్‌రోడ్డులో హైటెన్షన్ వైర్లు తగిలి సాత్విక్‌తో పాటు మరో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యారు. సాత్విక్ ఒళ్లంతా కాలిపోయి అవిటివాడిగా మారాడు. ఒళ్లు కాలి వికారంగా మారడంతో బడికి సైతం వెళ్లడం లేదు. చికిత్స కోసం రూ.2 లక్షలకు మించి సదరు పేద కుటుంబం ఖర్చు చేసింది. విద్యుత్‌శాఖ నుంచి ఒక్క రూపాయి పరిహారం రాలేదు.
ఈమె పేరు శైలజ. ఐదు రోజుల క్రితం గణపతి విగ్రహాన్ని తరలిస్తున్న క్రమంలో ఎల్‌టీ వైర్లు తగిలి గాయపడ్డ నితిన్ భార్య. నితిన్ కరీంనగర్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మూడు రోజులకే దాదాపు రూ.1.50 లక్షల వరకు ఖర్చయ్యింది. ఇంకా ఎన్ని రోజులు చికిత్స తీసుకోవాలో..ఎంత ఖర్చు వస్తుందో..తెలియడం లేదని ఆసుపత్రిలో ఉన్న శైలజ ఆవేదన వ్యక్తం చేస్తోంది. విద్యుత్‌శాఖ ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడం దయనీయం.

పరిహారం.. పరిహాసం!