
జూనియర్ కళాశాల ప్రారంభం
మేడిపల్లి: మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించారు. పోరుమల్లలో మడేలేశ్వర స్వామి బోనాల జాతరలో పాల్గొన్నారు. ఏళ్ల తరబడి ఎదురుచూసిన విద్యార్థులకు కళాశాల అందుబాటులోకొచ్చిందన్నారు. కళాశాల అభివృద్ధికి మాజీ సర్పంచ్ బొంగోని రాజగౌడ్ రూ.1.01 లక్షలను విరాళంగా అందించారు. మున్ముందు కూడా సహకరిస్తానని పేర్కొన్నారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు ముందుగా పూర్తి చేసుకున్నవారికి మొదటి బహుమతిగా రూ.50వేలు, రెండో బహుమతిగా రూ.40 వేలు, మూడో బహూమతిగా రూ.25వేల అందిస్తానని ప్రకటించారు.
వైద్యాధికారుల పోస్టులకు ఆహ్వానం
జగిత్యాల: జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ కింద కాంట్రాక్టు ప్రతిపాదికన నాలుగు వైద్యాధికారుల పోస్టుల భర్తీకి ఎంబీబీఎస్, తెలంగా ణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉన్న అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ తెలి పారు. రూ.500 డీడీని మెడికల్ హెల్త్ ఆఫీస్ పేరిట తీసి దరఖాస్తులను jagtial. telangna.gov.in వెబ్‌సైట్ నుంచి తీసుకుని విద్యార్హతల పత్రాలతో ఈనెల 26 వరకు జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న, గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించబోమని తెలిపారు.
రైతుల ఖాతాల్లో రూ.190.62 కోట్ల జమ
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని 2,10,145 మంది రైతులకు రైతుభరోసా కింద గురువారం వరకు రూ.190.62 కోట్లు జమ అయ్యాయి. జిల్లాలో మొత్తం 2,48,550 మంది రైతులు ఉండగా.. వారికి రూ.251.14 కోట్లు జమ కావాల్సి ఉంది. 18న 1,79,818 మందికి రూ.120.67కోట్లు, 19న 30,327 మందికి రూ.69.95కోట్ల చొప్పున జమ అయ్యాయి.
నంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్
జగిత్యాలక్రైం: జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్ లేని, నంబరు ప్లేట్ లేని 306 వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో ముమ్మర తనిఖీలు చేపట్టాయన్నారు. కొందరు ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకునేందుకు ఫ్యాన్సీ నంబర్లు, తప్పుడు నంబర్లను ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నంబరు ప్లేట్ ఏర్పాటు చేసినా.. వాహనాలు రోడ్డుపై తిప్పినా చీటింగ్ కేసు నమోదు చేస్తామన్నారు.
అర్చకుల సమస్యలపై వినతి
జగిత్యాలరూరల్: ఆలయ అర్చకుల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డికి వీర శైవ అర్చక సమైక్య అధ్యక్షుడు గుంటి జగదీశ్వర్ వినతిపత్రం సమర్పించారు. ఆయన వెంట రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్, ఎన్‌ఆర్‌ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఉమా మహేశ్వర్ ఉన్నారు.
జగన్నాథ రథయాత్రలో పాల్గొనండి
జగిత్యాలటౌన్: జూలై ఒకటిన నిర్వహించే జగన్నాథ రథయాత్రలో పాల్గొనాలని ఇస్కాన్ ప్రతినిధులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను కోరారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రిక అంచారు. కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు నరహరిదాస్, ప్రేమనందగోవిందదాస్, మున్సిపల్ మాజీ చైర్మన్లు అడువాల జ్యోతి, గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు.

జూనియర్ కళాశాల ప్రారంభం

జూనియర్ కళాశాల ప్రారంభం