
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి
జగిత్యాల/సారంగాపూర్: విద్యార్థులు టీవీలు, సెల్‌ఫోన్లు, వీడియోగేమ్‌లకు దూరంగా ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందని, పిల్లలు చదువుతోపాటు క్రీడలకు సమయం కేటాయించాలని డీఈవో రాము అన్నారు. గురువారం బీర్‌పూర్ మండలంకేంద్రం, కొల్వాయి, తుంగూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. కోనాపూర్‌లో బాస్కెట్‌బాల్ కోర్టును ప్రారంభించారు. జిల్లా కో–ఆర్డినేటర్ రాజేశ్, ఎంఈవోలు నాగభూషణం, కిశోర్, హెచ్‌ఎంలు భాస్కర్‌రెడ్డి, సత్యరాజ్, శంకరయ్య, వేణు, పెటా జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఉన్నారు. విద్యార్థుల్లో భవిష్యత్ నైపుణ్యాలు పెంచేందుకు అటల్ టింకరింగ్ మెకథాన్ బూట్ క్యాంప్ శిక్షణ ఉపయోగపడుతుందని డీఈవో అన్నారు. జిల్లాకేంద్రంలోని పురాతన పాఠశాలలో విద్యార్థులకు బూట్ క్యాంప్ శిక్షణ నిర్వహించారు. ఏఐ, ఎంఎల్, కోడింగ్, త్రీడీ ప్రిటింగ్ నేర్చుకోవాలన్నారు.
ఉల్లాస్‌యాప్‌లో నమోదు చేయాలి
నిరక్షరాస్యులను ఉల్లాస్‌యాప్‌లో నమోదు చేయాలని డీఈవో అన్నారు. ధరూర్ క్యాంప్‌లోని టీచర్స్ భవన్‌లో జాతీయ సాక్షరాభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ఉల్లాస్‌యాప్ ఉపయోగపడుతుందన్నారు. 14 ఏళ్లు నిండిన నిరక్షరాస్యులు, 60ఏళ్ల లోపు వారిని గుర్తించి ఇందులో చేర్చాలన్నారు. వయోజన విద్యాధికారి ప్రతాప్‌రావు, సార్వత్రిక సమన్వయకర్త నాగేశ్వర్‌రావు, డీఆర్డీఏ డీపీఎం మల్లేశ్, మెప్మా పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
21న యోగా దినోత్సవం
ఈనెల 21న యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈవో తెలిపారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో ఆరోగ్య భారత్ నిర్మాణ్‌లో భాగంగా హెచ్‌ఎంలు వేడుకలు నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో ఉదయం 6.30 నుంచి 7.45వరకు పిల్లలకు యోగాపై అవగాహన కల్పించాలన్నారు.