
ప్రజారోగ్యంపై వైద్యసిబ్బంది దృష్టిసారించాలి
కథలాపూర్: వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజారోగ్యంపై వైద్యసిబ్బంది దృష్టిసారించాలని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ అన్నారు. గురువారం కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వైద్యాధికారులతోపాటు వైద్యసిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం వివరాలు తెలుసుకునేందుకు వైద్యసిబ్బంది ఇంటింటా సర్వే చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పోగ్రామింగ్ ఆఫీసర్లు శ్రీనివాస్, రవీందర్, సత్యనారాయణ, వైద్యాధికారులు సింధూజ, రచన, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.