
కస్తూరిబా పాఠశాల తనిఖీ
మేడిపల్లి: కలెక్టర్ సత్యప్రసాద్ మండలంలో బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. మండలకేంద్రంలోని కస్తురిబా పాఠశాలను సందర్శించి.. వసతులు తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజనం, పప్పుదినుసులు, ఇతర వస్తువుల నాణ్యతను తెలుసుకున్నారు. విద్యార్థినులతో కలిసి ఉపాధ్యాయులు బోధించిన పాఠాలు విన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం కట్లకుంట గ్రామంలో భూ భారతి సదస్సులో పాల్గొన్నారు. భూ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీంచారు. ఆయన వెంట కోరుట్ల ఆర్డీవో జివాకర్ రెడ్డి, తహసీల్దార్ మునీందర్, ఎంపీడీవో పద్మజ, అధికారులు పాల్గొన్నారు.