
ఏడాదిలో ఎన్నో కేసులు..
జగిత్యాలక్రైం: జిల్లా ఎస్పీగా అశోక్‌కుమార్ బాధ్యతలు స్వీకరించి ఏడాది అయ్యింది. గతేడాది జూన్ 18న బాధ్యతలు స్వీకరించిన ఆయన.. జిల్లాపై తన మార్క్‌ను చూపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూశారు. పోలీసు అధికారులు, సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కేసుల నమోదు, వాటి చేధనకు దిశానిర్దేశం చేస్తున్నారు. సైబర్ నేరాల్లో నష్టపోయినవారికి బాసటగా నిలుస్తున్నారు. షీటీంలను పటిష్టం చేసి, ఆడపిల్లలు, మహిళలకు మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సైబర్ నేరస్తుల వలలో పడి మెట్‌పల్లికి చెందిన ఓ వైద్యుడు రూ.15 కోట్లు పోగొట్టుకోగా.. కేసు నమోదు చేసి డబ్బులు రికవరీ చేయించి నిందితులను అరెస్ట్ చేయించారు.
నిందితులకు లై డిటెక్టర్
రెండు హత్య కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో పోలీసులు లై డిటెక్టర్ వినియోగించారు. బీర్‌పూర్ శివారు రోల్లవాగు వద్ద 2024 జూన్ 14న గుర్తుతెలియని వ్యక్తిని పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చివేశారు. ఆ కేసును లై డిటెక్టర్ ద్వారా అతని భార్య అంకం అరుణ, కొడుకు అంకం సాయికుమార్‌ను నిందితులుగా నిర్ధారించారు. రాయికల్ మండల కేంద్రానికి చెందిన కోల జలను 2023 ఆగస్టు 29న గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయగా లై డిటెక్టర్ ద్వారా మృతురాలి మరిది శ్రీనివాస్, అతని భార్య సంధ్య హత్య చేసినట్లు నిర్ధారించి రిమాండ్‌కు తరలించారు.
కిడ్నాప్ కేసులను చాకచక్యంగా..
మెట్‌పల్లిలో 2024 ఆగస్టు 13న రెండేళ్ల బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయగా.. పోలీసులు 16 గంటల్లోనే నలుగురు కిడ్నాపర్లను పట్టుకున్నారు. బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉద్యోగాల పేరుతో జిల్లాకు చెందిన పలువురిని కంబోడియాకు తరలించి సైబర్ క్రైం ఊబిలో దింపిన నలుగురు నిందితులను అరెస్ట్ చేయించారు ఎస్పీ అశోక్‌కుమార్.
రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణ
రోడ్డు ప్రమాదాల నివారణకు ‘సురక్షిత ప్రయాణం’ అనే కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే 43 బ్లాక్‌స్పాట్లను గుర్తించి.. వివిధ శాఖల సమన్వయంతో ప్రమాదాలు నివారించగలిగారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలపై శ్రీపోలీసు పాఠశాల యువ పౌరుల కోసం భద్రతశ్రీ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి వారం ఒక ప్రభుత్వ పాఠశాలకు ఎస్పీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ రాత్రి సమయాల్లో పర్యవేక్షిస్తూ.. తనదైన పాత్ర పోషిస్తున్నారు. కొండగట్టులో నిర్వహించిన హనుమాన్ చిన్న, పెద్ద జయంతి ఉత్సవాలను పకడ్బందీగా చేపట్టారు. వినాయక చవితి, రంజాన్ తదితర ఉత్సవాల్లో భద్రత ఏర్పాట్లు చేసి ప్రశాంతంగా నిర్వహించుకునేలా కృషి చేశారు.
సైబర్ క్రైం నిరోధానికి చర్యలు
సెల్‌ఫోన్ల రికవరీకి ప్రాధాన్యత
జిల్లాపై ఎస్పీ అశోక్‌కుమార్ ముద్ర
ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి ఏడాది

ఏడాదిలో ఎన్నో కేసులు..