
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి
ధర్మపురి: తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వా మి ని మంత్రి అడ్లూ రి లక్ష్మణ్‌కుమార్ మెట్లమార్గం ద్వా రా కాలినడకన వెళ్లి దర్శించుకున్నారు. ఆలయ ఈవో లక్ష్మణ్‌కుమార్‌కు స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు.
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
రాయికల్: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులను తక్షణమే స్పందించాలని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. మంగళవారం రాయికల్ పోలీ స్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులు తనిఖీ చేశారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. బ్లూకోల్ట్స్, పెట్రోకార్స్, డ యల్ 100కు వెంటనే స్పందించాలని, సంఘటన స్థలానికి వెంటనే చేరుకోవాలని సూచించా రు. విజిబుల్ పోలిసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, పాత నేరస్తులపై నిఘా పెంచాలన్నా రు. ఆయన వెంట ఎస్సై సుధీర్‌రావు ఉన్నారు.
మల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌లో..
మల్లాపూర్: స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. గస్తీ, పెట్రోలింగ్, విజుబుల్ పోలీసింగ్ పెంచాలన్నారు. స్టేషన్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఎస్సై రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మల్యాల: సీజనల్ వ్యాధులపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రా థమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆరో గ్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఉపకేంద్రాల రికార్డులు పరిశీలించారు. మెరుగైన సేవలు అందించాలని, రికార్డులను ఎప్పటిప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. జిల్లా ప్రోగ్రామింగ్ ఆఫీసర్ సమీయోద్దీన్, డీపీఓ రవీందర్, వైద్యురాలు మౌనిక, అయిల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
బీసీ బిల్లుకు చట్టబద్దత
కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలి
జగిత్యాలటౌన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ జీవో విడుదల చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షే మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముసిపట్ల లక్ష్మీనారాయణ సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్‌ను కేంద్రం ఆమోదించకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్ అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీ రిజర్వేషన్ సాధనకు ఈనెల 18న సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. సంఘం నాయకులు తిరుపురం రాంచందర్, రాపర్తి రవి, గుంటి గంగారాం పాల్గొన్నారు.
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
జగిత్యాలటౌన్: రానున్న స్థానిక సంస్థల్లో పార్టీ గెలుపునకు బాటలు వేయాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుగుణరెడ్డి తెలిపా రు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా సమీ క్షా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిందన్నారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభారాణి, గోపి మాధవి, అల్లాల సరిత, సరళ, పిప్పరి అనిత, మమత పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి