ముదురుతున్న ఫ్లెక్సీల రగడ | - | Sakshi
Sakshi News home page

ముదురుతున్న ఫ్లెక్సీల రగడ

Jun 10 2025 3:22 AM | Updated on Jun 10 2025 3:22 AM

ముదుర

ముదురుతున్న ఫ్లెక్సీల రగడ

జగిత్యాల: డీసీసీ అధ్యక్షుడు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు మంత్రి పదవి రావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. అయితే ఫ్లెక్సీల ఏర్పాటు గందరగోళంగా మారింది. అడ్లూరికి శుభాకాంక్షలు తెలుపుతూ.. జిల్లాకేంద్రంలో మాజీమంత్రి జీవన్‌రెడ్డి వర్గీయులు, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జీవన్‌రెడ్డి ఫొటోతో ఉన్న ఫ్లెక్సీలో ‘ఒరిజినల్‌ కాంగ్రెస్‌’ అని రా యడం చర్చనీయాంశంగా మారింది. ఇది కాస్త సోషల్‌ మీడియాలో రగులుతోంది. మరికొందరు ఎమ్మెల్యే ఫొటోతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జిల్లాకు మంత్రి పదవి వచ్చిందని కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం వ్యక్తమవుతున్నా.. జిల్లాకేంద్రంలో మాత్రం ఫ్లెక్సీల రగడ చోటుచేసుకుటుండడం విశేషం.

పోటాపోటీగా జీవన్‌, సంజయ్‌ వర్గీయుల ఫ్లెక్సీలు ఏర్పాటు

జిల్లాకేంద్రంలో వేడెక్కిన రాజకీయం

ముదురుతున్న ఫ్లెక్సీల రగడ1
1/1

ముదురుతున్న ఫ్లెక్సీల రగడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement