సీఎంను కలిసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
జగిత్యాల: రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సోమవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు.
నేడు ధర్మపురికి మంత్రి రాక
ధర్మపురి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మంగళవారం ధర్మపురికి రానున్నారు. ఉదయం 11 గంటలకు పత్తిపాక క్రాస్ రోడ్డు నుంచి ధర్మారం, వెల్గటూర్, రాయపట్నం మీదుగా ధర్మపురి చేరుకుంటారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారు. అక్కడి నుండి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.
భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలి
కథలాపూర్: భూ భారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న గ్రామసభల ద్వారా వచ్చిన దరఖాస్తులను అధికారులు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మండలంలోని తాండ్య్రాల, గంభీర్‌పూర్ గ్రామాల్లో భూ భారతి గ్రామభలను సోమవారం పర్యవేక్షించారు. రైతు దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి పహాణీలు పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కోరుట్ల ఆర్డీవో జీవాకర్‌రెడ్డి, తహసీల్దార్ వినోద్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్‌ఐ నాగేశ్ పాల్గొన్నారు.
దుబ్బరాజన్న సన్నిధిలో భక్తజనం
సారంగాపూర్: దుబ్బరాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం కావడంతో రా జన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఆలయ ఈవో అనూష, వ్యవస్థాపక ధర్మకర్త శంకరయ్య, ఆలయ సిబ్బంది భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
మంత్రివర్గ విస్తరణలో మున్నూరు కాపులకు అన్యాయం
కథలాపూర్: కాంగ్రెస్ పార్టీ ఇటీవల చేపట్టిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు అన్యాయం జరిగిందని సంఘం జిల్లా అధ్యక్షుడు చెదలు సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలో సంఘం జిల్లా ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు మంత్రిగా అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో మున్నూరు కాపుల సంఖ్య 49లక్షలు ఉంటుందని, అయినప్పటికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పునరాలోచించి విప్ ఆది శ్రీనివాస్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు మల్లారెడ్డి, తిరుపతి, సుధాకర్, రాజేశ్, గంగాధర్, లింగారెడ్డి, గంగారెడ్డి పాల్గొన్నారు.
సీఎంను కలిసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
సీఎంను కలిసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
సీఎంను కలిసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్


