
పొగాకుతో గుండెకు ముప్పు
పాన్, గుట్కా, తంబాకు, సిగరెట్లలో నికోటిన్ వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి రక్తనాళాలను సంకుచితం చేస్తాయి. దీంతో రక్తప్రసరణ తగ్గి గుండైపె ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలంగా వీటిని వినియోగించే వారిలో గుండెపోటు, పక్షవాతం, హైపర్టెన్షన్ వంటి తీవ్రమైన కార్డియోవాస్కులర్ సమస్యలు వస్తాయి. పొగాకు వల్ల శరీరంలో శ్రీకోలెస్ట్రాల్శ్రీ స్థాయి పెరిగి, నాళాల్లో శ్రీబ్లాక్శ్రీ ఏర్పడుతుంది. ఇది గుండెకు రక్తసరఫరాను తగ్గించి ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, మితాహారం, వ్యాయామం పాటించడం ఎంతో అవసరం.
– డాక్టర్ అనీశ్పబ్బ, కార్డియాలజిస్టు