
ప్రాణం పోస్తున్న ఎమర్జెన్సీ వైద్యులు
● మెడికవర్‌లో వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే
కరీంనగర్‌టౌన్: కరీంనగర్‌లో ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్ కలిగిన ఏకై క ఆసుపత్రి మెడికవర్‌లో అందించే సేవలతో ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నాయని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డే సందర్భంగా మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పలువురు వైద్యులు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ఎమర్జెన్సీ విభాగం ఎంతో కీలకంగా మారిందన్నారు. ఆసుపత్రిలో ఎమర్జెన్సీతో పాటు క్రిటికల్ కేర్ టీం బ్యాక్ బోన్‌గా పనిచేస్తుందన్నారు. కేక్ కట్ చేసి, ఎమర్జెన్సీ వైద్యులను సన్మానించారు. మెడికవర్ సెంటర్‌హెడ్ గుర్రం కిరణ్, వైద్యులు సత్యనారాయణ, రుత్విక్, మహేష్, జగదీప్, దిలీప్, రవికిరణ్,, వినయ్, ఉపేందర్‌రెడ్డి, నాగరాజు, లోకేశ్, పల్లవి, విష్ణు, రవి, మల్లారెడ్డి పాల్గొన్నారు.