
కొత్త పింఛన్‌దారులకు 3.0 పింఛన్
జ్యోతినగర్(రామగుండం): ప్రయాస్ పథకాల కింత కొత్త పింఛన్‌దారులకు 3.0 పింఛన్ చెల్లింపు ఉత్తర్వులు విడుదలయ్యాయని ఈపీఎఫ్‌వో కరీంనగర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి నరేశ్, నోడల్ అధికారి పరశురాం తెలిపారు. ఎన్టీపీసీ మిలీనియం హాల్‌లో మంగళవారం నిధి పే నిక్కత్ 2.0లో భాగంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ, భవిష్యనిధి ద్వారా కార్మికులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కార్మికులు తమ వివరాలను ఈపీఎఫ్ సేవల వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని అన్నారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, ప్రయాస్ పథకం, వాటాదారులకు అవగాహన కల్పించారు.
ఫీఎఫ్ సమస్యలు పరిష్కరించాలి
ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు పీఎఫ్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఈమేరకు ఈఫీఎఫ్‌వో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి నరేశ్, నోడల్ అధికారి పరశురాంకు వినతిపత్రం అందించారు. పుట్టిన తేదీల్లో పొరపాట్లు, కాంట్రాక్టర్లు ఫీఎఫ్ జమచేయకపోవడం, యజమాని మారినప్పుడు, ప్రస్తుత నంబరుపై కాకుండా పాత నంబర్‌పై డబ్బులు జమచేయడం, 58 ఏళ్లవయసు పూర్తిచేసిన కార్మికులకు పింఛన్ రాకపోవడం, మాన్యువల్ పద్ధతిలోని పీఎఫ్ డబ్బులు ప్రస్తుత ిపీఎఫ్ నంబర్‌లోకి జమకాకపోవడం తదితర సమస్యలు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. సర్వీస్ సర్టిఫికెట్లలో ఇంటిపేరు పూర్తిగా లేకపోవడంతో నిధులు ట్రాన్సఫర్ కావడం లేదన్నారు. ఈ సమస్యలపై కరీంనగర్ భవిష్యనిధి కార్యాలయానికి వెళ్లే కార్మికులకు సిబ్బంది సహకరించకుండా, ఇబ్బందులకు గురిచేసే విధానం మానుకోవాలని హెచ్చరించారు. ఐన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్, సీఐటీయూ నాయకులు నాంసాని శంకర్, గీట్ల లక్ష్మారెడ్డి, ఐఎఫ్‌టీయూ నాయకులు చిలుక శంకర్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ ఈపీఎఫ్‌వో
ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి నరేశ్