లవ్‌ మ్యారేజ్‌ ఆపై విడాకులు.. మరో వ్యక్తితో పెళ్లి.. మళ్లీ మొదటి భర్తతో.. | - | Sakshi
Sakshi News home page

లవ్‌ మ్యారేజ్‌ ఆపై విడాకులు.. మరో వ్యక్తితో పెళ్లి.. మళ్లీ మొదటి భర్తతో..

Published Tue, Mar 19 2024 1:35 AM | Last Updated on Tue, Mar 19 2024 8:06 AM

- - Sakshi

ప్రాణం తీసిన మొదటి భర్త

విడాకులైనా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం

ఆలస్యంగా వెలుగుచూసిన సంఘటన

మల్యాల(చొప్పదండి): వారిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య కలాహాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. దీంతో యువతిని మరో వ్యక్తికిచ్చి వివాహం జరిపించారు. అయినప్పటికీ ఆమె తన మొదటి భర్తతో సన్నిహితంగానే ఉంటోంది. ఇంతలో ఏమైందో తెలియదుగానీ.. ఆమెను గొంతునులిమి హతమార్చి చెట్లపొదల్లో పడేశాడు. ఈ సంఘటన మల్యాల మండలం మ్యాడంపల్లి శివారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల పట్టణానికి చెందిన కరిపే అంజలి.. గొల్లపల్లి మండలం అగ్గిమల్లకు చెందిన కొల్లూరి నరేశ్‌ ప్రేమించుకున్నారు.

నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. కుటుంబకలహాల కారణంగా రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అనంతరం అంజలిని సిద్దిపేటకు చెందిన వ్యక్తికిచ్చి మరో పెళ్లి చేశారు. అయినా మొదటి భర్త నరేశ్‌ అంజలితో ఫోన్‌లో తరచూ మాట్లాడుతున్నాడు. రెండురోజుల క్రితం సిద్దిపేట నుంచి జగిత్యాలలోని పుట్టింటికి వచ్చిన అంజలికి ఫోన్‌ చేసిన నరేశ్‌.. ఈనెల 17న తన బైక్‌పై తీసుకెళ్లాడు.

మ్యాడంపల్లి శివారులోకి చేరగానే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమె గొంతునులిమి చంపి చెట్లపొదల్లో పడేశాడు. సోమవారం అటుగా వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నీలం రవి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాలకు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement