
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద వెబ్‌కాస్టింగ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్
జగిత్యాల: జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు సంబంధించి స్థానిక వీఆర్‌కే కళాశాలలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, అత్యవసర సర్వీసుల వారి ఓట్లు లెక్కిస్తారని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి వేర్వేరు లెక్కింపు కేంద్రాలను ఏర్పాటుచేశామని, ఒక్కో కేంద్రంలో 14 టేబుళ్లు ఏర్పాటు చేయగా.. జగిత్యాల – 19, కోరుట్ల – 19, ధర్మపురి –20 రౌండ్లలో లెక్కింపు ఉంటుందని వివరించారు. ప్రతి నియోజకవర్గానికి 25 మంది మైక్రో అబ్జర్వర్లు, 25 మంది సూపర్‌వైజర్లు, 25 మంది సహాయకులతోపాటు, అదనంగా 150 మందిని నియమించామని తెలిపారు. అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల పరిశీలకులు ఈవీఎంలను కట్టుదిట్టంగా భద్రపర్చుతారని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ లత, ఎన్నికల వ్యయ అధికారులు ఉన్నారు.
● జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా
Comments
Please login to add a commentAdd a comment