జగిత్యాల జోన్/ఇబ్రహీంపట్నం(కోరుట్ల): విద్యుత్ చౌర్యం కేసులో ఒకరికి రూ.13,544 జరిమానా విధిస్తూ జగిత్యాల మొదటి అదనపు జిల్లా జడ్జి వీర య్య మంగళవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లి ంచలేని పరిస్థితుల్లో రెండు నెలల సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కోన్నారు. కరీంనగర్ ట్రాన్స్‌కో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ కె.స్వామి వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలంలోని యామన్‌పల్లికి చెందిన పల్లెమీది మహేందర్ జూన్ 26, 2019న విద్యుత్ చౌర్యానికి పాల్పడగా సంబంధిత అధికారులు పట్టుకొని, ట్రాన్స్‌కో విజిలెన్స్ పోలీసులకు అప్పగించారు. వారు మొదటి తప్పుగా భావించి, రూ.1,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించి, మరోసారి విద్యుత్ చౌర్యానికి పాల్పడనని హామీ ఇచ్చిన మహేందర్ ఆగస్టు 20, 2019న విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డాడు. విద్యుత్ శాఖ అధికారులు పట్టుకొని, విజిలెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు నిందితుడిపై కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టగా పరిశీలించిన న్యాయమూర్తి మహేందర్‌కు జరిమానా విధించారు. సాక్ష్యాలను కోర్టుకు సమర్పించిన ఎస్సైలు ఎ.నిరంజన్‌రెడ్డి, టి.నవేష్, కానిస్టేబుళ్లు ఇంతియాజ్, మల్లారెడ్డిలను విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ అభినందించారు.