CoronaVirus: World Must be Prepared Well for the Next Pandemic Says WHO Chief | తరువాతి మహమ్మారికి సిద్ధంగా ఉండాలి! - Sakshi
Sakshi News home page

తరువాతి మహమ్మారికి సిద్ధంగా ఉండాలి!

Sep 8 2020 2:09 PM | Updated on Sep 8 2020 6:38 PM

World must be better prepared for next pandemic, says WHO chief - Sakshi

జెనీవా : కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అతలాకుతలమవుతున్నవేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ మరో సంచలన హెచ్చరిక చేశారు. "ఇదే చివరి మహమ్మారి కాదు" అని జెనీవాలో ఒక వార్తా సమావేశంలో పేర్కొన్నారు. ప్రపంచం తదుపరి మహమ్మారికి సిద్ధంగా ఉంటే మంచిది అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలు ప్రజారోగ్యంపై మరిన్ని పెట్టుబడులు పెట్టాలని  కూడా ఆయన పిలుపునిచ్చారు.

కరోనా మహమ్మారి ఒక్కటే ప్రపంచానికి చివరిది కాదు, మున్ముందు మరిన్ని ప్రాణాంతక మహమ్మారులు వచ్చే అవకాశం లేకపోలేదని అధనామ్ అన్నారు. మహమ్మారి అనేది జీవిత వాస్తవం.. అది జీవితంలో ఒక భాగం. అందుకే భవిష్యత్‌లో మహమ్మారి వస్తే దానిని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు ప్రస్తుతం కంటే మెరుగ్గా సిద్ధంగా ఉండాలని సూచించారు. భవిష్యత్‌లో ప్రజారోగ్యంపై అన్ని దేశాలు  మరింత శ్రద్ధ పెట్టాలని, భారీగా ఖర్చు చేయాలని టెడ్రోస్ వెల్లడించారు.

కాగా 2019 డిసెంబర్‌లో  చైనాలో మొదటి కేసు గుర్తించగా క్రమంగా అది ప్రపంచ దేశాలను చుట్టేసింది. అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలు ఈ మమమ్మారికి భారీగా  ప్రభావితమయ్యాయి.  ప్రపంచవ్యాప్తంగా 27.19 మిలియన్ల ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడ్డారు.  8,88,326 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement