ఉప్పు ముప్పు.. ఏటా 30 లక్షల మరణాలు: డబ్ల్యూహెచ్‌ఓ | WHO Issues Benchmarks For Sodium Content in Food | Sakshi
Sakshi News home page

ఉప్పు ముప్పు.. ఏటా 30 లక్షల మరణాలు: డబ్ల్యూహెచ్‌ఓ

May 5 2021 6:16 PM | Updated on May 5 2021 9:49 PM

WHO Issues Benchmarks For Sodium Content in Food - Sakshi

ఉప్పు అధికంగా తీసుకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తుంది

న్యూఢిల్లీ: ఎన్ని మసలాలు దట్టించినా.. ఎంత గుమగుమలాడేలా చేసిన ఉప్పు వేయకపోతే ఆ వంట వృధా. ముఖ్యంగా మన దగ్గర ఉప్పు లేని భోజానాన్ని ఊహించలేం. వైద్యపరంగా చూసుకున్న, రుషుల చెప్పే మాట అయినా ఉప్పు వాడకాన్ని పూర్తిగా పక్కకు పెట్టమనేవారు. లేదంటే ఏదో కొద్దిగా అలా ఆహారం మీద చల్లుకోమని సూచిస్తారు. తాజాగా ఈ జాబితాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేరింది. ఉప్పు అధికంగా తీసుకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తుంది. ఈ మేరకు బుధవారం డబ్ల్యూహెచ్‌ఓ గైడ్‌లైన్స్‌ జారీ చేసింది. ఆహార పదార్థాల్లో సోడియం కంటెంట్‌ను పరిమితం చేసుకోవాలని సూచించింది.

డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా సరైన పోషణ లేక 11 మిలియన్ల మంది మరణిస్తున్నారని.. వీరిలో సుమారు 30 లక్షల మంది అధిక సోడియం వాడకం వల్ల చనిపోయారని తెలిపింది. అనేక సంపన్న దేశాలతో పాటు తక్కువ ఆదాయ దేశాలలో కూడా ఉప్పు వాడకం ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. రోజు తీసుకునే ఆహారమైన రొట్టె, తృణధాన్యాలు, ప్రాసెస్‌ చేసిన మాసం, జున్నుతో సహా ఇతర పాల ఉత్పత్తుల ద్వారా  సోడియం తీసుకుంటున్నారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

ఉప్పు రసాయనిక నాయం సోడియం క్లోరైడ్.. ఇది శరీరంలోని నీటి పరిమాణాన్ని నియంత్రించే ఖనిజం. ఉప్పు పరిమితిని తగ్గించుకోవడానికి సరైన విధానాలను ఏర్పాటు చేసుకోవాలి. సరైన ఆహార పదర్థాలను ఎంపిక చేసుకోవడానికి వీలుగా అధికారులు సరైన సమాచారాన్ని అందించాలి అని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు.

చదవండి: ఉప్పును ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement