USA సంచలన నిర్ణయం.. ఆర్మీ చీఫ్ తొలగింపు | USA removes Army Chief | Sakshi
Sakshi News home page

USA సంచలన నిర్ణయం.. ఆర్మీ చీఫ్ తొలగింపు

Apr 4 2026 2:26 AM | Updated on Apr 4 2026 2:30 AM

USA removes Army Chief

ఇరాన్‌తో దాడులు తీవ్రతరమైన వేళ అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ ఆర్మీ చీఫ్ స్టాప్ జనరల్‌ రాండీ జార్జ్‌ను పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అయితే అతని తొలగింపుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.

పశ్చిమాసియా యుద్ధం ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇరాన్, అమెరికాల మధ్య ప్రస్తుతం భీకర దాడులు కొనసాగుతున్నాయి. అంతే కాకుండా ప్రస్తుతం అమెరికా బలగాలు పెద్దఎత్తున మధ్య ప్రాచ్యంలో మోహరించబడ్డాయి. ఇంత ఉద్రిక్తతల నడుమ ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను తొలగిస్తూ ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన పదవి నుండి తప్పుకున్నారు.

అయితే 2024 ఆగస్టులో పదవి బాధ్యతలు చేప్టటిన రాండీ జార్జ్‌ పదవికాలం వచ్చే ఏడాది ఆగస్టు వరకూ ఉంది. అయితే రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పీట్స్ హెగెత్ భారీ స్థాయిలో ప్రక్షాళనలు చేపడుతున్నారు. గత సంవత్సరం డజనుకు పైగా కీలక అధికారులను పదవి నుంచి తొలగించారు. కాగా ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా ప్రస్తుతం యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతున్న సమయంలో ఒక దేశ ఆర్మీ చీఫ్‌ను పదవినుంచి తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంమైంది. ఇరాన్‌పై అమెరికా భూతల దాడులు చేపట్టనుందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement