పేలిన స్పేస్‌ఎక్స్‌ స్టార్‌షిప్‌ | SpaceX Starship Prototype Explodes on Landing After Test Launch | Sakshi
Sakshi News home page

పేలిన స్పేస్‌ఎక్స్‌ స్టార్‌షిప్‌

Dec 11 2020 5:25 AM | Updated on Dec 11 2020 5:25 AM

SpaceX Starship Prototype Explodes on Landing After Test Launch - Sakshi

వాషింగ్టన్‌: ఎలాన్‌ మస్క్‌ కలల ప్రాజెక్ట్‌కు చుక్కెదురైంది. ప్రతిష్టాత్మక స్పేస్‌ఎక్స్‌ స్టార్‌ షిప్‌ ప్రొటోటైప్‌ బుధవారం ల్యాండింగ్‌కు యత్నిస్తూ పేలిపోయింది. టెక్సాస్‌లోని బోకాచికా రాకెట్‌ కేంద్రం నుంచి విజయవంతంగా లాంచైన అనంతరం 6 నిమిషాల 42 సెకండ్లు పయనించి స్ట్రాటోస్పియర్‌ను చేరింది, అనంతరం క్రమంగా దిగువకు వస్తూ లాంచింగ్‌ ప్యాడ్‌ను తాకిన వెంటనే పేలిపోయింది. అంతరిక్షంలోకి మనుషులను తీసుకుపోయేందుకు మస్క్‌ కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా ప్రొటోటైప్‌ను పరీక్షించింది. కంపెనీ కొత్తగా తయారు చేసిన రాప్టర్‌ ఇంజిన్లను ఉపయోగించి 41 వేల అడుగుల ఎత్తును చేరడం ఈ ప్రయోగ ఉద్దేశం. కానీ ఎంత ఎత్తుకు షిప్‌ పయనించిందో కంపెనీ వెల్లడించలేదు. లాంచింగ్‌ సమయంలో ఫ్యూయల్‌ హెడర్‌ ట్యాంక్‌ ఒత్తిడి తక్కువగా ఉందని, దీంతో లాండింగ్‌ వేగం పెరిగి పేలిపోయిందని మస్క్‌ వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement