
దుబాయ్: ఎర్ర సముద్రంలోని యూఎస్‌ఎస్ హారీ ఎస్ ట్రూమన్ విమాన వాహన నౌకపై మోహరించిన మరో ఫైటర్ జెట్ సముద్రంలో ప్రమాదవశాత్తూ పడిపోయింది. అధునాతన ఎఫ్/ఏ–18 సూపర్ హార్నెట్ రకం విమానం ల్యాండయ్యే క్రమంలో జరిగిన పొరపాటుతో షిప్‌పై నుండే స్టీల్ వైర్ తాళ్లకు హుక్ కాలేదని, ఫలితంగా జారి సముద్ర జలాల్లో పడిపోయిందని ఓ అధికారి చెప్పారు. అందులోని ఇద్దరు పైలట్లను హెలికాప్టర్ సాయంతో రక్షించామని, ఘటనలో వారిద్దరూ గాయపడ్డారని వివరించారు. ఈ జెట్ ఖరీదు రూ.513 కోట్లు.
ఇదే షిప్‌పై సరిగ్గా ఇలాంటి విమానమే ఏప్రిల్‌లో ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోవడం తెల్సిందే. గతేడాది డిసెంబర్‌లో అమెరికాకే చెందిన యూఎస్‌ఎస్ గెట్టిస్‌బర్గ్ నౌక గైడెడ్ మిస్సైల్ ప్రయోగించి మరో ఎఫ్/ఏ–18ను పొరపాటున కూలి్చవేసింది. ట్రూమన్ విమాన వాహక నౌక ఫిబ్రవరిలో ఈజిప్టులోని పోర్ సయీద్‌లో వాణిజ్య నౌకను ఢీకొట్టింది. ఎర్ర సముద్ర జలాల్లో పశ్చిమ దేశాల వాణిజ్య నౌకలపై హౌతీల దాడులు పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పటికే ఉన్న యూఎస్‌ఎస్ కార్ల్ విన్సన్‌కు తోడుగా అమెరికా ప్రభుత్వం యూఎస్‌ఎస్ హారీ ట్రూమన్‌ను ఇక్కడికి పంపించింది.