ఆఖరి నిమిషంలో కూలిన విమానం  | Russian plane carrying 50 passengers Missing Latest News Live Updates | Sakshi
Sakshi News home page

ఆఖరి నిమిషంలో కూలిన విమానం 

Jul 24 2025 12:00 PM | Updated on Jul 25 2025 4:23 AM

Russian plane carrying 50 passengers Missing Latest News Live Updates

48 మంది సజీవదహనం 

మాస్కో: ల్యాండింగ్‌ విఫలంకావడంతో మళ్లీ గాల్లోకి లేచి మరోసారి ల్యాండింగ్‌ కోసం గాల్లో చక్కర్లు కొడుతున్న 50 ఏళ్ల పాత రష్యా విమానం ఒకటి అనూహ్యంగా కొండప్రాంతంలో కూలిపోయింది. రష్యాలోని చైనా సరిహద్దుల్లోని మారుమూల అమూర్‌ రీజియన్‌లోని టిండా పట్టణ సమీపంలో ఈ ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కుప్పకూలిన విమానం నుంచి చెలరేగిన మంటల్లో విమానంలోని వారంతా అగ్నికి ఆహుతయ్యారు. 

మొత్తం 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారు. టిండా విమానాశ్రయానికి 15 కిలోమీటర్ల దూరంలో గురువారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. రష్యా శివారు అమూర్‌ రీజియన్‌ గవర్నర్‌ వాసిలీ ఓర్లోవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సోవియట్‌ కాలంనాటి అంగారా ఎయిర్‌లైన్స్‌ ఆంటోనోవ్‌ ఏఎన్‌24 విమానం ఖబరోవ్సŠక్‌ నుంచి బ్లాగోవెచెన్సక్‌ సిటీకి బయల్దేరింది. షెడ్యూల్‌ ప్రకారం మార్గమధ్యంలో టిండా పట్టణంలో ల్యాండ్‌ కావాల్సి ఉంది. అయితే ల్యాండింగ్‌కు ప్రయత్నించగా అది సాధ్యంకాలేదు. 

దీంతో మళ్లీ గాల్లోకి లేచి మరోసారి ల్యాండింగ్‌ కోసం ఆకాశంలో అలా చుట్టూ తిరిగి వస్తోంది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌కు 15 కిలోమీటర్ల దూరంలో అటవీప్రాంతంపై ఎగురుతుండగా హఠాత్తుగా రాడార్ల నుంచి అదృశ్యమైంది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి ఈ విమానానికి సంబంధాలు తెగిపోయాయి. వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి ఎంఐ–8 హెలికాప్టర్‌తో గాలింపు చేపట్టగా సమీప కొండప్రాంతంలో విమానం శకలాలు కనిపించాయి. ప్రమాదానికి అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం అదుపుతప్పి నేలరాలి ఉంటుందని స్థానిక ఇంటర్‌ఫ్యాక్స్‌ న్యూస్‌ఏజెన్సీలో కథనాలు వెలువడ్డాయి.

 

దుర్ఘటనలు:

  • 2011: Flight 9007 – ఇన్-ఫ్లైట్ ఇంజిన్ ఫైర్ వల్ల ఒబీ నదిలో విమానం కూలి ఏడుగురు చనిపోయారు

  • 2019: Flight 200 – టేకాఫ్ తర్వాత ఇంజిన్ ఫెయిల్యూర్‌ జరిగి ఓ బిల్డింగ్‌ను ఢీకొని అగ్నిప్రమాదం సంభవించింది. ఇద్దరు సిబ్బంది ఈ ఘటనలో చనిపోయారు.

  • 2025, జులై 24న: ఏ24 ఫ్లయిట్‌- గమ్యస్థానానికి కొద్దికిలోమీటర్ల దూరంలో ఉండగా తెగిపోయిన సిగ్నల్స్‌.. కాసేపటికే ప్రమాదం.. విమానంలోని 43 మంది మరణించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement