Sakshi News home page

Russia-Ukraine War: రష్యా సంప్రదాయాలకు ఉక్రెయిన్‌ ‘నో’

Published Tue, Dec 26 2023 4:52 AM

Russia-Ukraine War: Ukraine is celebrating Christmas on the Western calendar this year - Sakshi

కీవ్‌: తమ భూభాగంపై దురాక్రమణకు దిగిన రష్యాపై ఆగ్రహంగా ఉన్న ఉక్రెయిన్‌ శతాబ్దకాలంగా పాటిస్తూ వస్తున్న సంప్రదాయానికీ తిలోదకాలు ఇచి్చంది. వందేళ్లకుపైగా ఉక్రెయిన్‌ జనవరి ఏడో తేదీనే క్రిస్మస్‌ వేడుకలను జరుపుకుంటోంది. రష్యా దండయాత్రతో ఆ దేశంతో శత్రుత్వం మరింత పెంచుకున్న ఉక్రెయిన్‌.. రష్యాతోపాటు అనుసరిస్తున్న రోమన్లకాలంనాటి జూలియన్‌ క్యాలెండర్‌ను పట్టించుకోవద్దని నిర్ణయించుకుంది.

ప్రపంచంలో అత్యధిక క్రైస్తవ మెజారిటీ దేశాలు పాటించే గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ను ఇకపై అనుసరించాలని తుది నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన చట్టానికి ఈ జూలై నెలలోనే దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం ఈఏడాది తొలిసారిగా డిసెంబర్‌ 25వ తేదీనే క్రిస్మస్‌ వేడుకలు ఉక్రెయిన్‌ అంతటా జరిగాయి. దేశంలో డిసెంబర్‌ 25వ తేదీన క్రిస్మస్‌ వేడుకలు జరగడం వందేళ్లలో ఇదే తొలిసారి.

ఇన్నాళ్లూ రష్యాతోపాటు జూలియన్‌ క్యాలెండర్‌ను అనుసరిస్తూ జనవరి ఏడో తేదీన క్రిస్మస్‌ను జరుపుకుంది. ఈ సంవత్సరంతో ఉక్రెయిన్‌ కొత్త సంప్రదాయానికి తెరతీసింది. ‘ ఉక్రేనియన్లు సొంత సంప్రదాయాలు, సెలవులు, సొంత పర్వదినాలతో జీవించనున్నారు’ అని ఈ సందర్భంగా జెలెన్‌స్కీ అన్నారు. ఉక్రెయిన్‌లో క్రైస్తవ జనాభానే అధికం. ఉక్రెయిన్‌లో దశాబ్దాలుగా రష్యన్‌ ప్రాచీన చర్చి సంప్రదాయాలనే ఎక్కువగా పాటిస్తుండటం గమనార్హం.

Advertisement

What’s your opinion

Advertisement