రష్యా కీలక నిర్ణయం.. పెట్రో ఎగుమతుల నిషేదం | Russia to ban gasoline products | Sakshi
Sakshi News home page

రష్యా కీలక నిర్ణయం.. పెట్రో ఎగుమతుల నిషేదం

Mar 28 2026 4:45 AM | Updated on Mar 28 2026 4:46 AM

Russia to ban gasoline products

పశ్చిమాసియా యుద్ధంతో చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో  రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ సరఫరాకు ప్రాధాన్యతనిచ్చేందుకు ఏప్రిల్ 1 నుంచి గ్యాసోలిన్ ఎగుమతులను నిషేదించనున్నట్లు ప్రకటించింది.

ఇరాన్‌పై హర్మూజ్ జలసంధిని మూసివేసిన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ప్రపంచ క్రూడాయిల్‌ రవాణా 20 శాతం మేర హర్మూజ్ మీదుగానే జరుగుతుంది. ఇప్పుడు దానిని ఇరాన్ క్లోజ్ చేయడంతో ఇప్పుడు సప్లై చైన్ దెబ్బతిని చమురు కొరత ఏర్పడింది.

ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులు పెరిగాయి. కాగా ఇప్పుడు రష్యా సైతం గ్యాసోలిన్ ఉత్పత్తుల ఎగుమతులను  ఏప్రిల్ 1 నుంచి నిషేదించనున్నట్లు  ప్రకటించింది. దేశీయ పెట్రోలియం ఉత్పత్తుల మార్కెట్‌లోని పరిస్థితిని సమీక్షించడానికి రష్యా ఉప ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ అధ్యక్షతన జరిగిన సమావేశం జరిగింది.  అనంతరం ఈ ప్రకటన వెలువడింది.

అంతర్గత డిమాండ్‌ను తీర్చడానికి పారిశ్రామిక సంస్థల వద్ద తగినంత గ్యాసోలిన్ మరియు డీజిల్ నిల్వలతో పాటు అధిక రిఫైనరీ సామర్థ్య వినియోగం ఉందని నోవాక్ తెలిపారు. .దేశీయ ఇంధన ధరలు అంచనాలకు మించి పెరగకుండా నిరోధించాలని అధ్యక్షడు పుతిన్ ఆదేశాల మేరకే  ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement