వీడియో: ఉబ్బిన ముఖం, వణికిపోతూ.. క్షీణిస్తున్న పుతిన్‌ ఆరోగ్యం?

Rumours Swirl Around Russia President Vladimir Putin Health - Sakshi

రష్యాకు హెచ్చరికలు.. పాశ్చాత్య దేశాలకు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రతిహెచ్చరికల నేపథ్యంలో ఉక్రెయిన్‌ యుద్ధం కీలక మలుపు తిరుగుతోంది. ఈ తరుణంలో.. పుతిన్‌ ఆరోగ్యం మీద సంచలన కథనాలు వెలువడుతున్నాయి.

ఉక్రెయిన్‌ యుద్ధం మొదయ్యాక రష్యా అధ్యక్షుడు పుతిన్‌(69) వ్యక్తిగత జీవితంతో పాటు ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే.. యుద్ధం తారాస్థాయికి చేరుతున్న తరుణంలో పుతిన్‌ ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తోందన్న పుకార్లు సుడులు తిరుగుతున్నాయి. ఈమధ్యకాలంలో పుతిన్ పాల్గొన్న సమావేశాలు, హాజరైన బహిరంగ ర్యాలీలను అందుకు ఉదాహరణలుగా చూపిస్తున్నారు. 

పుతిన్‌ తాజా ఫొటోలు, వీడియో ఫుటేజీల ఆధారంగా.. పుతిన్‌ బాడీ లాంగ్వేజ్‌లో తీవ్రమైన మార్పులు వచ్చాయనేది ఆరోగ్య నిపుణులు చెప్తున్నమాట. ఎక్కువ సేపు నిల్చోలేకపోతుండడం, ఆయన చేతులు వణుకుతుండడం, ఆయాస పడుతుండడం, అలాగే ఆయన ముఖం ఏదో ఒక రకమైన కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నట్లు కనిపిస్తుందని వాదిస్తున్నారు.

అంతేకాదు.. ఒలింపిక్‌ అథ్లెట్స్‌ను గౌరవించే ఓ కార్యక్రమంలో పుతిన్‌ పాల్గొనగా.. ఆ ఈవెంట్‌ ఫొటోల ఆధారంగా శరీరంలో విపరీతమైన మార్పులు వచ్చాయని న్యూయార్క్‌ పోస్ట్‌ సైతం ఓ కథనం ప్రచురించింది. బెలారస్‌ అధ్యక్షుడితో భేటీ సందర్భంలోనూ.. పుతిన్‌ టేబుల్‌ను సపోర్ట్‌గా పట్టుకోవడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తూ పుతిన్‌ ఆరోగ్యంపై కథనం ప్రచురించింది న్యూస్‌ వీక్‌. 

ఇదిలా ఉంటే.. వైట్‌హౌజ్‌ మాత్రం రష్యా అధ్యక్షుడి ఆరోగ్యంపై స్పందించేందుకు నిరాకరిస్తోంది. ఇదంతా పాశ్చాత్యదేశాల కల్పిత కథనాలంటూ క్రెమ్లిన్‌ కొట్టిపాడేస్తుండగా.. వయసు పైబడుతున్న పుతిన్‌లో పార్కిసన్‌ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ కొందరు నెటిజన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top