Viral Video: This Road Plays Song When Drivers Travel At Right Speed - Sakshi
Sakshi News home page

రోడ్డుపై సావధానంగా వెళ్లండి.. చక్కని సంగీతం వినండి.. వీడియో వైరల్‌

Jul 26 2023 9:49 AM | Updated on Jul 26 2023 10:45 AM

road plays song when drivers travel at right speed - Sakshi

ట్విట్టర్‌లో వైరల్‌ అవుతున్న ఒక వీడియోలో హంగరీలోని ఒక మ్యూజికల్‌ రోడ్డు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ రోడ్డుపై తగిన స్పీడుతో వెళుతున్నప్పుడు ఈ సంగీత మాధుర్యం వినిపిస్తుంది. హంగరీ టుడే తెలిపిన వివరాల ప్రకారం ఈ రోడ్డును రోడ్డు నంబర్‌ 37 అని అంటారు. ఈ రోడ్డు హంగరీలోని ఈశాన్య ప్రాంతంలో ఉంది. ఈ రహదారి స్లోవాకియా సరిహద్దులలోని ఫెస్లోజసోల్కా మీదుగా సటోరల్‌జౌజెలీ వరకూ సాగుతుంది. ఔట్‌లెట్‌ తెలిపిన వివరాల ప్రకారం ఈ రోడ్డుపై వాహనం సావధానంగా వెళ్లినప్పుడు ఎరిక్‌ ఎ స్జొలో అనే జానపద గీతం వినిపిస్తుంది

హంగరీకి చెందిన సోమోగీ కౌంటీలో రెండేళ్ల క్రితం ఈ రోడ్డును నిర్మించారు.  అప్పటి నుంచి ఈ రోడ్డు వార్తల్లో ఉంది. ఈ రోడ్డుకు సంబంధించిన వీడియో తరచూ వైరల్‌ అవుతోంది. ఈ రోడ్డుకు సంబంధించిన వీడియోకు 15 మిలియన్లకుపైగా వ్యూస్‌ రాగా, 1.5 లక్షల లైక్స్‌ దక్కాయి. ఈ రహదారిలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఈ రోడ్డు నిర్మాణంలో ప్రత్యేక అమరిక ఉంది. ఈ రోడ్డుపై వెళ్లే వాహనాల టైర్లకు.. రోడ్డుకు మధ్య  రాపిడి జరిగినప్పుడు శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంది. ఒకవేళ డ్రైవర్‌ వాహనాన్ని వేగంగా పోనిస్తే వికృతమైన శబ్ధాలు వినిపిస్తాయి. 

మరికొన్ని దేశాలు కూడా ఇటువంటి ప్రయోగాన్ని చేశాయి. మొదట 1995లో డెన్మార్క్‌లోని గైలింగ్‌లో రెండు కిలోమీటర్ల మేర ఇటువంటి రోడ్డు నిర్మించారు. రోడ్డుపై ఉబ్బెత్తు ఫుట్‌పాత్‌ మార్కర్స్‌ సాయంతో దీనిని నిర్మించారు. ఫ్రాన్స్‌లో 2000లో విలోపింట్‌ నగరంలో ఇటువంటి రోడ్డు నిర్మించారు. అయితే 2006లో పలువురు డ్రైవర్లు రోడ్డుపై వచ్చే ఈ సౌండ్‌ తమ ఏక్రాగ్రతను దెబ్బతీస్తున్నదని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: అమెరికా అధ్యక్షుడికి అతి పెద్ద కష్టం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement