Pakistani Woman Must Return Caller Threatens Mumbai Police - Sakshi
Sakshi News home page

పబ్జీ జంట ప్రేమకథలో మరో మలుపు.. 26/11 తరహా దాడులు చేస్తామని బెదిరింపు కాల్

Jul 13 2023 9:35 PM | Updated on Jul 14 2023 8:46 PM

Pakistani Woman Must Return Caller Threatens Mumbai Police  - Sakshi

ముంబై: పబ్జీ పరిచయంతో భారత్ వచ్చి ప్రియుడిని కలుసుకున్న పాకిస్తాన్ మహిళ సీమ హైదర్ తిరిగి పాకిస్తాన్ చేరుకోకుంటే 26/11 ముంబై దాడుల తరహాలో మళ్ళీ మారణకాండకు పాల్పడాల్సి ఉంటుందని ముంబై కంట్రోల్ రూముకు ఎవరో అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి బెదిరించారు.  

పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారతీయ యువకుడు సచిన్ మీనాను వెతుక్కుంటూ వచ్చింది పాకిస్తాన్ మహిళ సీమా హైదర్. తన నలుగురు పిల్లలతో సహా నోయిడా చేరుకున్న ఆమెపై నోయిడా పోలీసులు అక్రమ చొరబాటు కేసు, ఆశ్రయమిచ్చిన ప్రియుడిపై మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు వీరిద్దరికి బెయిల్ ఇవ్వడంతో కథ సుఖాంతమైందని అనుకుంటున్న తరుణంలో ఈ ఫోన్ కాల్ మళ్ళీ వివాదాస్పదమైంది. 

అయితే ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్తాన్ నుంచి ఆమెకు సంబంధించినవారు ఎవరో ఈ కాల్ చేసి ఉంటారని.. దీన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని యూపీ పోలీసులకు తెలిపినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: చితిలో సగం కాలిన శవాన్ని తిన్న తాగుబోతులు.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement