ఇరాన్‌ క్షిపణ శక్తిపై భీకర దాడులు | Iran israel war latest news Updates On 21st March | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

ఇరాన్‌ క్షిపణ శక్తిపై భీకర దాడులు

ఇరాన్‌ క్షిపణ శక్తిపై ఇజ్రాయెల్‌ వాయుసేన భీకర దాడులు

  • ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ మెరుపు దాడులు
  • ఇరాన్‌ క్షిపణి తయారీ కేంద్రాలు ధ్వంసం
  • బాలిస్టిక్‌ మిసైల్‌ ఫ్యాక్టరీలే లక్ష్యంగా ఐడీఎఫ్‌ ఆపరేషన్‌
  • గల్ఫ్‌ రీజియన్‌లో యుద్ధ మేఘాలు
  • ఇరాన్‌ ఉనికికే ముప్పు ఏర్పడవచ్చనే అనుమానం
  • ఇరాన్‌ క్షిపణ శక్తిపై ఇజ్రాయెల్‌ వాయుసేన భీకర దాడులు
  • ఒకవైపు హార్ముజ్‌ జలసంధి దిగ్బంధం.. మరోవైపు టెహ్రాన్‌పై బాంబుల వర్షం
  • ఇరాన్‌ మిసైల్‌ సంపదపై ఇజ్రాయెల్‌ సర్జికల్‌ స్టైక్‌
     
2026-03-21 20:40:33

ఇరాన్‌ దాడులు ఆపాలని 22 దేశాల సంయుక్త ప్రకటన

  • హార్మూజ్‌జలసంధిని తెరవాలని ఇరాన్‌ను కోరిన పలుదేశాలు
  • చమురు కేంద్రాలు, నౌకలపై దాడులను ఖండించిన పలు దేశాలు
  • దాడులు ఆపాలన్న ఫ్రాన్స్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, గల్ఫ్‌ దేశాలు
  • ఇరాన్‌ దాడులతో అన్ని దేశాల ప్రజలపై తీవ్ర ప్రభావం
  • ఇరాన్‌ దాడులు ఆపాలని 22 దేశాల సంయుక్త ప్రకటన
     
2026-03-21 19:53:43

మోదీ ప్రయత్నానికి మద్దతు ఇవ్వండి: రాజ్‌నాథ్‌

  • పశ్చిమాసియాలో యుద్ధంపై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ స్పందన
  • చర్చలు, దౌత్యంతో సమస్యలను పరిష్కరించుకోవాలని మోదీ చెప్పారు
  • ప్రపంచం ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది
  • యుద్ధానికి పరిష్కారం యుద్ధంతో లభించదని మోదీ చెప్పారు
  • ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్య ప్రయత్నాలు చేయాలి
  • ప్రధాని మోదీ ప్రయత్నానికి దేశ ప్రజలు మద్దతు ఇవ్వాలి 
2026-03-21 19:08:12

ఇరాన్‌పై మళ్లీ దాడులు పెంచిన అమెరికా, ఇజ్రాయెల్‌

  • నతాంజ్‌ అణు కేంద్రంపై మళ్లీ దాడులు
  • ఇరాన్‌పై మున్ముందు భారీ దాడులు
  • యుద్ధ లక్ష్యాలను సాధించే వరకూ విశ్రమించం: ఇజ్రాయెల్‌
2026-03-21 19:01:35

నతాంజ్ అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు

  • ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్‌ దాడులు
  • నతాంజ్ అణు శుద్ధి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు
  • రేడియోధార్మిక పదార్థాలు లీక్ కాలేదన్న ఇరాన్‌ మీడియా
  • సమీపంలో ఉండే ప్రజలకు ప్రమాదం లేదని వివరణ 
2026-03-21 18:25:58

వాణిజ్య సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

  • వాణిజ్య సిలిండర్ల సరఫరాను 20 శాతం పెంచిన కేంద్రం
  • హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
  • వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల గ్యాస్‌ సిలిండర్లు
  • ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ

 

2026-03-21 18:24:11

ఇరాన్‌ అధ్యక్షుడికి మోదీ ఫోన్‌

  • ఇరాన్‌ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్‌
  • యుద్ధం తర్వాత రెండో సారి ఫోన్‌ చేసిన మోదీ
  • పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చ
  • దాడులను ఖండించిన ప్రధాని మోదీ
  • ప్రాంతీయ స్థిరత్వాన్ని దాడులు దెబ్బతీస్తాయని వ్యాఖ్య
2026-03-21 16:20:29

నౌకలను సురక్షితంగా వెళ్లనిస్తున్నాం: ఇరాన్

  • హార్మూజ్ జలసంధి తెరిచే ఉంది
  • మాతో ఆయా దేశాలు సంప్రదిస్తే సరిపోతుంది
  • మేము ఈ జలసంధిని మూసివేయలేదు
  • మా శత్రువుల నౌకలను మాత్రమే వెళ్లనివ్వడం లేదు
  • ఇతర దేశాల నౌకలు ఈ జలసంధి ద్వారా వెళ్లవచ్చు
  • సంప్రదింపులు జరిపితే వారి నౌకలను సురక్షితంగా వెళ్లనిస్తాం 
  • ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటన
2026-03-21 14:35:03

అమెరికా ఫ్రీ హ్యాండ్‌.. ట్విస్ట్‌ ఇచ్చిన ఇరాన్‌

  • ఇరాన్‌కు చెందిన క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకానికి అమెరికా తాత్కాలికంగా ఆంక్షల సడలింపు.  
  • అమెరికా ప్రకటనపై ఇరాన్ అనూహ్య స్పందన.
  • ప్రస్తుతం ఇరాన్ వద్ద అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేయడానికి తగినంత ఇంధనం నిల్వలు లేవని స్పష్టం చేసింది.
  • ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ప్రకటన విడుదల చేసింది.
2026-03-21 12:15:24

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక నిర్ణయం

  • సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేత
  • ఇరాన్‌ చమురు అమ్మకాలకు 30 రోజుల మినహాయింపు
2026-03-21 09:57:10

విజయం కావాలి: ట్రంప్‌

  • ఇరాన్‌పై మాకు విజయం కావాలి
  • కాల్పుల విరమణపై చర్చలు జరపాలనుకోవడం లేదు
  • ఖర్గ్‌ ద్వీపానికి సంబంధించి మా వద్ద ఉన్న ప్రణాళికలు చెప్పలేను
  • ఇరాన్‌ నౌకాదళం, వైమానిక దళాన్ని నాశనం చేశాం
  • సైనిక పరంగా ఇరాన్‌ పని అయిపోయింది
  • ఇరాన్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాం. 
2026-03-21 09:15:48

దాడులను ఖండించిన 19 దేశాలు

  • దాడులను ఖండించిన 19 దేశాలు
  • హార్మూజ్​ జలసంధిలో దాడులను ఖండించిన 19 దేశాలు
  • హార్మూజ్​ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులను ఫిన్లాండ్‌ సహా 19 దేశాలు ఖండించాయి.
  • అంతర్జాతీయ చట్టాలను పాటించాలని పిలుపునిస్తూ సంయుక్త ప్రకటన
  • యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్, కెనడా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, న్యూజిలాండ్, డెన్మార్క్, లాట్వియా, స్లోవేనియా, ఎస్టోనియా, నార్వే, స్వీడన్, చెకియా, రొమేనియా, బహ్రెయిన్, లిథువేనియా దేశాలన్నీ ప్రకటనపై సంతకాలు.
2026-03-21 09:15:48

దాడుల స్పీడ్‌ పెంచిన ఇరాన్‌..

  • బాగ్దాద్‌లోని అమెరికన్‌ ఎంబసీపై మరోసారి దాడులు.
  • క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్‌.
  • దుబాయ్‌, ఖతార్‌ ప్రముఖ ప్రాంతాలను దెబ్బతిసే విధంగా ఇరాన్‌ ప్లాన్‌. 
2026-03-21 08:26:27

ఇరాన్‌ హెచ్చరిక..

  • పశ్చిమాసియాలో 22వ రోజుకు చేరిన యుద్ధం.
  • గల్ఫ్‌ దేశాలు, ఇజ్రాయెల్‌ కొనసాగుతున్న ఇరాన్‌ దాడులు.
  • కువైట్‌లోని కీలక రిఫైనరీల్లో మంటలు.
  • పర్యాటక ప్రాంతాలపై కూడా దాడులు చేస్తామన్న ఇరాన్‌. 
2026-03-21 07:37:08

ట్రంప్‌నకు నాటో దేశాల షాక్‌

  • ట్రంప్‌నకు నాటో దేశాల షాక్‌
  • నాటో మిత్రదేశాలపై ట్రంప్ ఘాటు విమర్శలు
  • ఇరాన్‌ యుద్ధంలో చేరనందుకు నాటో మిత్రదేశాలపై ట్రంప్ విమర్శలు
  • పిరికివాళ్లను గుర్తుపెట్టుకుంటామంటూ ట్రంప్ హెచ్చరిక
  • హార్మూజ్‌ జలసంధిని తెరిపించేందుకు నాటో దేశాలు రాకపోవడంపై ట్రంప్ అసహనం
  • జలసంధి తెరిపించేందుకు సైనిక సహాయం కోరిన ట్రంప్
  • ట్రంప్ డిమాండ్‌ను పట్టించుకోని నాటో దేశాలు
2026-03-21 07:28:01

ఇరానియన్ల పట్టుదల భేష్​: మోజ్తబా ఖమేనీ

  • మోజ్తబా ఖమేనీ లిఖితపూర్వకంగా ఓ ధిక్కార ప్రకటన
  • శత్రువులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు
  • అగ్రశ్రేణి నేతలను చంపడం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చనే భ్రమతోనే అమెరికా, ఇజ్రాయెల్​లు దాడులు చేస్తున్నాయి. 
2026-03-21 07:28:01

ఇరాన్‌కు నౌకాదళం లేదు: ట్రంప్‌

  • ఇరాన్‌ నౌకాదళంపై ట్రంప్‌ కామెంట్స్‌..
  • రెండు వారాల క్రితం ఇరాన్​కు​ నౌకాదళం ఉండేది.
  • ఇప్పుడది సముద్రంలో మునిగిపోయింది
  • కేవలం రెండు వారాల్లో ఇరాన్‌కు చెందిన 58 వార్​ షిప్‌లను ముంచేశాం.
2026-03-21 07:28:01
Advertisement
 
Advertisement
Advertisement