వేగంగా నడిపితే దేశ బహిష్కరణ.? | Kuwait warns of strict action against speeding drivers | Sakshi
Sakshi News home page

వేగంగా నడిపితే దేశ బహిష్కరణ.?

May 30 2026 4:35 AM | Updated on May 30 2026 5:13 AM

Kuwait warns of strict action against speeding drivers

కువైట్ : గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఏ విధంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా చిన్న తప్పులకే ఆ దేశంలో పెద్దపెద్ద శిక్షలు అమలు చేస్తుంటారు. తాజాగా కువైట్‌ అలాంటి చట్టాన్నే కొత్తగా తీసుకొచ్చింది. వాహనాలను వేగ పరిమితికి మించి నడిపిన వారిపై దేశ బహిష్కరణ గురి చేసే చట్టాన్ని అమలులోకి  తెచ్చింది.

కువైట్‌లో రోడ్డు ప్రమాదాల అరికట్టే నేపథ్యంలో ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రహదారులపై పరిమితికి మించిన వేగంతో నడిపితే వారిపై తీవ్రమైన కేసులు పెట్టి భారీ జరిమానాలు విధిస్తామని తెలిపింది. దానితో పాటు వాహనాలు జప్తు చేస్తామని పేర్కొంది. ఒకవేళ అందులో విదేశీయులు గనుక ఉన్నట్లయితే వారిపై దేశ బహిష్కరణ చర్యలు సైతం తీసుకుంటామని పేర్కొంది.

వాహనదారులు అతివేగంతో వాహనాలు నడుపుతున్నందున ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అదే విధంగా ట్రాఫిక్ నియమాలను ఆదేశ పౌరులతో సహా అందరూ పాటించాలని అధికారులు సైతం ఈ విషయంలో కఠినంగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement