వివాహితతో మరో మహిళ శృంగారం.. భర్తకు నష్ట పరిహారం

Japan Court Orders Woman To Pay Compensation For Man Having Illegal Relation With His Wife - Sakshi

టోక్యో: వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాక శృంగారంలో పాల్గొన్నందుకు గాను ఆమె భర్తకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోర్టు ఓ మహిళను ఆదేశించింది. ఈ సంఘటన జపాన్లో చోటు చేసుకుంది. వివరాలు.. ఓ వ్యక్తి(39) సదరు మహిల తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాక శృంగారంలో పాల్గొన్నదని.. ఇందుకు గాను ఆమె వద్ద నుంచి నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా టోక్యో కోర్టును ఆశ్రయించాడు. తన భార్యకు, సదరు మహిళకు ఆన్‌లైన్‌ ద్వారా పరిచయం ఏర్పడిందని.. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం వీరద్దరు ఏకాంతంగా కలుసుకున్నారని.. ఆ సమయంలో శృంగారంలో పాల్గొన్నారని ఆరోపించాడు. అతడి వాదనలు విన్న కోర్టు ఆ వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు జరిమానా విధించింది. బాధితుడి భార్యతో శృంగారంలో పాల్గొన్నందుకు గాను అతడికి 1,10,000 యెన్‌ల(భారత కరెన్సీలో 70 వేల రూపాయలు) నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది. 

ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ.. కోర్టు తీర్పుపై స్పందిస్తూ.. ‘‘అతడి భార్యకు, నాకు మధ్య జరిగినది చట్టరీత్యా నేరం కాదు. దాని వల్ల వారి వైవాహిక జీవితానికి  ఎలాంటి నష్టం వాటిల్లలేదు’’ అని తెలిపింది. వైవాహిక జీవితంలో శాంతిని దెబ్బతీసే చర్యలను తప్పుగానే భావించాలని, పెళ్లయిన యువతితో లైంగిక సంబంధం పెట్టుకుని అశాంతి కలిగించినందుకు జరిమానా చెల్లించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే, కోర్టు తీర్పు సోషల్ మీడియాలో చర్చనీయమైంది. స్వలింగ సంపర్కాన్ని కోర్టు వ్యతిరేకిస్తున్నట్లుగా తీర్పు ఉందని నెటిజనులు అభిప్రాయపడుతున్నారు. నచ్చిన వ్యక్తులు.. పరస్పర అంగీకారంతో లైంగికంగా కలిస్తే తప్పు ఏముందని ప్రశ్నిస్తున్నారు.

గతంలో ఓ కేసు సందర్భంగా కూడా టోక్యో హైకోర్టు ఇలాంటి తీర్పునే వెల్లడించింది. తన మహిళా భాగస్వామని మోసం చేసినందుకు గాను ఆమెకి పరిహారం చెల్లించాల్సిందిగా ఓ మహిళను ఆదేశించింది. ఈ జంట ఏడు సంవత్సరాలు కలిసి జీవించినట్లు సమాచారం. వారు యుఎస్ లో వివాహం చేసుకున్నారు మరియు పిల్లల్ని కనడం గురించి కూడా చర్చించారు. ఈ క్రమంలో భాగస్వామి తనను మోసిం చేసిందని మరొక యువతి కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు మహిళా భాగస్వామికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా సదరు మహిళను ఆదేశించింది.

చదవండి: బాడీగార్డ్‌తో సంబంధం.. రూ. 9 కోట్లు చెల్లించిన ప్రిన్సెస్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top