అగ్రరాజ్యంలో భారతీయ అమెరికన్లపై వివక్ష నిత్యకృత్యం

Indian-Americans Regularly Encounter Discrimination: Survey - Sakshi

చర్మం రంగుపై అవహేళనలు సర్వసాధారణం 

కులం గుర్తింపును ఇష్టపడుతున్న హిందూ భారతీయ అమెరికన్లు 

‘సోషల్‌ రియాలిటీస్‌ ఆఫ్‌ ఇండియన్‌ అమెరికన్స్‌’ సర్వే

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాకు వలస వచ్చిన వారిలో భారతీయ అమెరికన్లదే రెండోస్థానం. అయినప్పటికీ వారిపై వివక్ష, వేధింపులు కొనసాగుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. అమెరికాలో భారతీయ అమెరికన్లను వివక్షను ఎదుర్కోవడం నిత్యం సర్వసాధారణంగా మారిందని పేర్కొంది. ‘సోషల్‌ రియాలిటీస్‌ ఆఫ్‌ ఇండియన్‌ అమెరికన్స్‌’ పేరిట 2020లో కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్, జాన్స్‌ హాప్కిన్స్‌–ఎస్‌ఏఐఎస్, యూనివర్సిటీ పెన్సిల్వేనియా సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే నివేదికను బుధవారం విడుదల చేశారు. సర్వేలో భాగంగా అమెరికాలో నివసించే 1,200 మంది భారతీయ అమెరికన్లను గత ఏడాది సెపె్టంబర్‌ 1 నుంచి 20వ తేదీ వరకూ ఆన్‌లైన్‌ ద్వారా ప్రశ్నించారు.

అమెరికా గడ్డపై తాము వివక్షను ఎదుర్కొంటున్నామని ప్రతి ఇద్దరిలో ఒకరు చెప్పారు. ప్రధానంగా తమ చర్మం రంగుకు సంబంధించి అవహేళనకు గురవుతున్నామని తెలిపారు. భారతదేశంలో పుట్టి అమెరికాకు వచి్చన వారు మాత్రమే కాకుండా అమెరికాలోనే పుట్టిన భారత సంతతి ప్రజలకు కూడా ఇదే రకమైన చేదు అనుభవాలు ఎదురవుతుండడం గమనార్హం. భారతీయ తండ్రి–అమెరికా తల్లికి, భారతీయ తల్లి–అమెరికా తండ్రికి పుట్టిన వారు సైతం కొన్ని సందర్భాల్లో శ్వేత జాతిæఅమెరికన్ల నుంచి వివక్షను చవిచూడాల్సి వస్తోంది. 

వదలని కుల జాడ్యం
భారతీయ అమెరికన్ల జీవితాల్లో మతం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. నిత్యం ఒక్కసారైనా ప్రార్థన చేస్తామని 40% మంది చెప్పారు. వారంలో ఒక్కసారైనా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటామని 27% మంది తెలిపారు. భారతీయ అమెరికన్లను తమ కులం గుర్తింపును వదులుకోవడం లేదు. సగం మంది హిందూ ఇండియన్‌ అమెరికన్లు తమ కులాన్ని సూచించే ఆనవాళ్లను కొనసాగిస్తున్నారు. అమెరికాలో పుట్టిన వారి కంటే ఇండియాలో పుట్టిన భారతీయ అమెరికన్లలో ఈ ధోరణి ఎక్కువ. అక్కడి మొత్తం హిందువుల్లో ప్రతి 10 మందిలో 8 మంది తమ కులంపై మమకారం చాటుకుంటున్నారు. ఇండియన్‌ అమెరికన్‌ అని చెప్పుకోవడం కూడా చాలామంది గర్వకారణంగా భావి స్తున్నారు. మొత్తం అమెరికా జనాభాలో ఇండియన్‌ అమెరికన్లు 1 శాతం కంటే ఎక్కువే ఉన్నారు. రిజిస్టరైన ఓటర్లలో 1 శాతం కంటే తక్కువగా ఉన్నారు. 2018 నాటి గణాంకాల ప్రకారం అమెరికాలో 42 లక్షల మంది భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top