I Took To Heal Myself And Age Backwards Ian Clark Health Secrets - Sakshi
Sakshi News home page

46లో అలా.. 64లో ఇలా.. అలా ఎలా?

Published Tue, Nov 1 2022 8:49 PM

I Took To Heal Myself And Age Backwards Ian Clark Health Secrets - Sakshi

కొన్ని కొన్ని విషయాలు డాక్టర్లు కాదు.. పేషేంట్లు చెబితేనే బాగా అర్థమవుతాయి. సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేశారు ఇయాన్ క్లార్క్. ట్విట్టర్లో ఆయన పంచుకున్న అంశాలు .. కచ్చితంగా మనకు ఆరోగ్య రహస్యాలెన్నో చెబుతాయి. 

నాకప్పుడు 46 ఏళ్లు

  • అధిక బరువుతో బాధ పడ్డాను
  • ఏడాదికి మూడు సార్లు ఏదో ఒక జబ్బు వచ్చేది
  • వీపరీతమైన నిరాశ, నిస్పృహాల్లో మునిగిపోయేవాడిని
  • జుట్టు వేగంగా ఊడిపోయేది

నాకిప్పుడు 64 ఏళ్లు

  •  ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నా
  • ఎలాంటి రోగాలు, జబ్బులు లేవు
  • సంతోషంగా ఉన్నాను
  • నాకు గుండు ఏమాత్రం కనిపించనంతగా పూర్తి స్థాయిలో వెంట్రుకలున్నాయి.

అసలేం జరిగింది? ఈ 46 నుంచి 64 ఏళ్ల మధ్య కాలంలో నేను ఏం చేశాను? అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా మారడానికి నేను పడ్డ కష్టమేంటీ? ముందుగా నేను ఏ డాక్టర్ను కలవలేదు. ఎలాంటి మందులు వాడలేదు. అసలు హెల్త్ ఇన్సూరెన్సే తీసుకోలేదు. నేను చేసిన పనులేంటో మీరే చదవండి.

1. ఆహారంగా తాజా పళ్లు, కాయగూరలు
నా ఆరోగ్యం బాగుండడానికి నేను చేసిన మొదటి పని ఆహారంగా తాజా పళ్లు, కాయగూరలు తీసుకోవడం. ఇది వారంలో ఒక రోజు చేసింది కాదు. రోజూ దీన్ని అనుసరించాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవద్దనే నియమాన్ని కఠినంగా అనుసరించాను. ల్యాబ్ల్లో తయారై బాక్సుల్లో అందంగా ప్యాక్ చేసి కనిపించే భోజనాన్ని పూర్తిగా దూరం పెట్టాను. నా చుట్టున్న మార్కెట్లో, పంట పొలాల్లో నాకు మట్టిలో కనిపించే ఆహార పదార్థాలను ఎంచుకున్నాను. సూపర్ మార్కెట్‌లో దొరికే వాటి కంటే ఈ పదార్థాల్లో ఎన్నో పోషకాలుంటాయి. 

2. మాంచి నిద్ర పోవడం మొదలెట్టాను
కచ్చితంగా నిద్ర కోసం సమయాన్ని కేటాయించుకున్నాను. సమయమయిందంటే చాలు.. ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు ఆపేసి నిద్ర పోవడం అలవాటు చేసుకున్నాను. అంతేనా.. రోజులో కూడగా ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకున్నాను. దీని వల్ల మనసు ప్రశాంతంగా అనిపించింది. నా మెదడుకు ఎంతో రిలాక్స్ దొరికింది. వయస్సు మీద పడినట్టుగా అనిపించే కారకాలన్నీ దూరమయ్యాయి.

అతి ముఖ్యమైన విషయం. నిద్ర రావడానికి టాబ్లెట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకండి. 
- మీరు పడుకునే చోట ఎలాంటి లైట్లు ఉండకూడదు
- రూం టెంపరేచర్ తక్కువగా ఉంటే మంచిది
- ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఉండకూడదు
.

3. ఉపవాసం
ఉపవాసం అతి ముఖ్యమైనది. ఎందుకంటే... మన భోజన షెడ్యూల్ను కచ్చితంగా అనుసరించడం.. అంటే ఒకే సమయంలో అల్పహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్ర భోజనం తీసుకోవడం చాలా మంచిది. సాయంత్రం అని ఎందుకంటున్నానంటే.. పడుకునేకంటే చాలా ముందుగా ఆహారం తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. అలాగే అప్పుడప్పుడు చేసే ఉపవాసాల వల్ల శరీరం నుంచి యాంటీ అక్సిడెంట్స్ సులువుగా బయటికి వెళ్లిపోతాయి. ఇవి వెళ్లిపోవడం వల్ల కాన్సర్, అల్జీమర్స్, స్ట్రోక్, గుండె వ్యాధులు లాంటివి రావు. 

గత కొన్నాళ్లుగా నేను కేవలం రెండు పూటలకు మాత్రమే పరిమితమయ్యాను. అదీ కూడా సేంద్రీయ సాగు ద్వారా పండించిన పంటలనే ఎంచుకుంటున్నాను. ఈ అలవాట్ల వల్ల నా భోజనం ఖర్చు సగానికి సగం తగ్గింది. 

4) మెగ్నిషియం సప్లిమెంట్ 
మన శరీరానికి మెగ్నిషియం చాలా అవసరం. 
కండరాలు, జాయింట్లు, రోగ నిరోధక శక్తి
మెదడు, గుండె, ఇతర ముఖ్య శరీర భాగాలు

వీటన్నింటికి మెగ్నిషియం అవసరం. మనం ఎలాంటి భోజనం తీసుకున్నా.. వీటికి సరిపడా మెగ్నిషియం రాదు. సాగులో మనం అనుసరిస్తున్న విధానాలు అలాంటివి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 75శాతం మంది మెగ్నిషీయం లోపంతో బాధపడుతున్నారు. అందుకే మెగ్నిషియంను అదనంగా సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నాను. 

ఇవీ నేను అనుసరిస్తున్న విధానాలు. అందుకే 46 ఏళ్లలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న సమస్యల కంటే 64 ఏళ్లలో ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను.

Advertisement
Advertisement