మాజీ పోర్న్‌ స్టార్‌ అరెస్ట్.. కొడుకును హత్య చేసిందని ఆరోపణలు

EX Porn Star Arrested Over stabs Two Years Son In Italy - Sakshi

పెరుజియా: కన్న బిడ్డను హత్య చేసిందనే ఆరోపణలతో ఓ మాజీ పోర్న్‌ స్టార్‌ అరెస్ట్‌ అయింది. ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కటాలిన్ ఎర్జ్‌బెట్ బ్రాడాక్స్ అనే మాజీ పోర్న్‌ స్టార్‌ ఓ సూపర్‌ మార్కెట్‌లో తీవ్రమైన కత్తి గాయాలతో ఉ‍న్న తన రెండేళ్ల బాలుడు అలెక్స్ జుహాజ్‌తో కనిపించింది. తన కుమారుడిని కాపాడాలంటూ కేకలు వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

చదవండి:  నిర్వహణలో లోపాలతోనే ఫేస్‌బుక్‌ డౌన్‌

అయితే అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడు. సూపర్‌ మార్కెట్‌ పక్కన ఉన్న ఓ భవనంలో అలెక్స్‌కు సంబంధించిన రక్తపు టీ షర్టు పోలీసులకు లభ్యమైంది. అలెక్స్‌ మృతదేహంపై 9 గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే బాలుడిని తల్లి కటాలిన్‌ హత్య చేసినటట్లు ఆమె మాజీ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కటాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులకు ఆమె పర్స్‌లో కత్తి కనిపించడంతో స్వాధీనం చేసుకున్నారు.

కటాలిన్‌ తన నుంచి విడాకులు తీసుకొని, అలెక్స్‌తో ఇటలీలో ఉంటుందని ఆమె మాజీ భర్త నార్బర్ట్ జుహాజ్ తెలిపారు. కటాలిన్‌తో విడిపోయిన నార్బర్ట్‌ హంగేరిలో ఉంటున్నాడు. కటాలిన్‌, నార్బర్ట్‌ విడిపోయి.. అలెక్స్ పెంపకంపై న్యాయ పోరాటం చేస్తున్నారు. తన మీది ఉన్న కోపంతోనే అలెక్స్‌ను చంపి ఉంటుందని నార్బర్ట్ ఆరోపించాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న కటాలిన్‌ నార్బర్ట్‌ ఆరోపణలను ఖండించింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top