మంచి తల్లిగా ఉండాలనే రాజకీయాల నుంచి తప్పుకున్నా!: జెసిండా

Ex New Zealand PM Quits Politics Was The Best Mother I Could Be - Sakshi

న్యూజిలాండ్‌ మాజీ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జెసిండా వెల్లింగ్టన్‌లోని పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ.. నేను మంచి తల్లిగా ఉండాలనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా. నాయకత్వానికి మాతృత్వం అడ్డు కాకూడదని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నంట్లు వివరించారు.

ఆమె గత జనవరి నెలలో ప్రధాని పదవికి రాజీనామ చేస్తూ అందర్నీ షాక్‌ గురి చేసిన సంగతి తెలిసిందే. ఆమె తన ఐదేళ్ల పాలనలో దేశం ఎన్నో సంక్షోభాలను లోనైంది. కొన్ని చీకటి రోజులను ఎదుర్కొనక తప్పలేదు. సరిగ్గా 2019 క్రైస్ట్‌చర్చిలోని రెండు మసీదులపై జరిగి తీవ్రవాద దాడిలో 51 మంది మరణించారు. అదే ఏడాది అగ్నిపర్వతం విస్పోటనం చెంది సుమారు 22 మంది మరణించారు. తర్వాత కరోనా ఇలా వరుస సంక్షోభాలను జెసిండా పాలన ఎదుర్కొంది

భయంకరమైన క్షణాల్లో మన దేశాన్ని విచారంగా చూశానని, అలాగే దుఃఖభరితంగా ఉన్నప్పుడూ దేశాలు ముందుకు సాగలేవని తెలుసుకున్నానని జెసిండా తన ప్రసంగంలో చెప్పారు. ఆ ఘటనలు మన మనస్సులో మెదులుతాయన్నారు. కానీ ఆ క్షణాలు మన ఉనికిలో భాగమవడమేగాక వాటిని ఎదుర్కొనేలా కూడా సన్నద్ధమవ గలగుతామని ఆమె చెప్పారు. 2018లో జెసిండా శ్రామిక మహిళలకు పెద్ద పీట వేస్తూ.. బెనజీర్‌ బుట్టో తర్వాత శక్తిమంతమైన రెండో ప్రపంచ నాయకురాలిగా పేరుగాంచారు.

ఈ సందర్భంగా తన మాతృత్వ ప్రయాణం గురించి కూడా చెబుతూ.. ప్రధాని హోదాలో ఉన్న ఒత్తిడి కారణంగా తల్లి కాలేకపోయినట్లు పేర్కొంది కూడా. చాలా కాలం అందుకోసం నిరీక్షించానని తెలిపింది. ఎట్టకేలకు తాను తల్లి కాబోతున్నానని తెలిసి ఆశ్చర్యంగా అనిపించిందని అందుకే వెంటనే పదవికి రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు.

కాగా, జెసిండా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగానే.. తిరిగి ఎన్నికయ్యే సామర్థ్యం లేక బెదిరింపుల కారణాంగా ఇలా  రాజీనామ చేస్తున్నారంటూ ..విమర్శలు గుప్పుమన్నాయి. దీనికితోడు ఆమె లేబర్‌ పార్టీ ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు ముందు జరిగే ఓపీనియన్‌ పోల్‌లో దారుణంగా పడిపోయింది కూడా!

(చదవండి: అఫ్ఘాన్‌ నుంచి యూఎస్‌ సేనల నిష్క్రమణలో వైఫల్యానికి కారణం అదే! నివేదిక విడుదల)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top