Chicken Price: ఆల్‌టైం రికార్డు సృష్టించిన చికెన్ ధర.. కేజీ రూ.720..!

Chicken Prices Gone All Time High In Pakistan - Sakshi

ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్‌లో చికెన్ ధర ఆకాశన్నంటింది. కరాచీ సహా ఇతర నగరాల్లో కేజీ చికెన్ ధర ఏకంగా రూ.720కి చేరింది. పాకిస్తాన్ చరిత్రలోనే ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి అని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే చికెన్ రేటు‍ రికార్డు స్థాయిలో పెరగడానికి పౌల్ట్రీ వ్యాపారాలు మూతపడటమే ప్రాధన కారణమని పాకిస్తాన్ మీడియా తెలిపింది. కోళ్ల ఫీడ్‌కు తీవ్ర కొరత ఏర్పడిందని, అందుకే పౌల్ట్రీ వ్యాపారులు బిజినెస్ నిలిపివేశారని చెప్పింది. ప్రస్తుతం కరాచీలో కేజీ చికెన్ ధర రూ.720గా ఉంది. ఇస్లామాబాద్, రావల్పిండి, సహా ఇతర నగరాల్లో  ఈ ధర రూ.700-705గా ఉంది. పాకిస్తాన్‌లో రెండో పాపులర్ సిటీ అయిన లాహోర్‌లో కేజీ చికెన్‌ను రూ.550-600 మధ్య విక్రయిస్తున్నారు. 

చరిత్రలో కనీవినీ ఎరుగుని ఈ ధరలు చూసి చికెన్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ప్రోటీన్లు పుష్కలంగా చికెన్‌ను తినలేకపోతున్నామని చెబుతున్నారు.

విచారణ
కోళ్లకు అందించే ఫీడ్‌కు కొరత ఎందుకు ఏర్పడిందనే విషయంపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. చికెన్ ధరలను తగ్గించి ప్రజలకు ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తోంది. పౌల్ట్రీ పరిశ్రమ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో చాలా ముఖ్యమైన భాగం.  దాని సరఫరా గొలుసుకు ఏవైనా అంతరాయాలు ఏర్పడితే దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని పాక్ మీడియా పేర్కొంది.
చదవండి: టర్కీ, సిరియాలో 29,000 దాటిన భూకంప మృతులు..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top