ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షునిగా అజయ్‌ బంగా | Sakshi
Sakshi News home page

ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షునిగా అజయ్‌ బంగా

Published Thu, May 4 2023 6:30 AM

Ajay Banga Selected 14th President of the World Bank - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ సంస్థలకు సారథులుగా వెలుగొందుతున్న భారతీయుల జాబితాలో ప్రముఖ భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్త అజయ్‌ బంగా నిలిచారు. ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షునిగా ఎంపికయ్యారు! ఆయన నియామకాన్ని ఖరారుచేస్తున్నట్లు బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు బుధవారం ప్రకటించారు.

జూన్‌ రెండో తేదీ నుంచి ఐదేళ్లపాటు అధ్యక్షునిగా బంగా సేవలందిస్తారని బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక భారతీయ అమెరికన్‌ అధ్యక్షుడు ప్రపంచ బ్యాంక్‌ పగ్గాలు  చేపట్టడం ఇదే తొలిసారి. 63 ఏళ్ల బంగాను ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఈ పదవికి నామినేట్‌చేశారు. బంగా జనరల్‌ అట్లాంటిక్‌ సంస్థ ఉపాధ్యక్షునిగా, మాస్టర్‌కార్డ్‌ సీఈవోగా చేశారు. కేంద్రం 2016లో ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.

Advertisement
 
Advertisement