ఫస్ట్‌క్లాస్‌ టికెటెలా కొన్నాడో?

Actor Satish Shah encounters racism at UK Heathrow airport - Sakshi

బాలీవుడ్‌ నటుడు సతీశ్‌ షాకు జాతి వివక్ష

ముంబై: లండన్‌ హిత్రూ విమానాశ్రయంలో తనకు జాతి వివక్ష అనుభవం ఎదురైందని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సతీశ్‌ షా చెప్పారు. ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణానికి టికెటెలా కొన్నాడంటూ ఇద్దరు ఎయిర్‌పోర్టు సిబ్బంది తనను ఉద్దేశించి మాట్లాడుకున్నారని తెలిపారు. భారతీయుడిని కాబట్టి కొన్నానంటూ నవ్వుతూ బదులిచ్చానని వెల్లడించారు. సతీశ్‌  ట్వీట్‌ వైరల్‌గా మారింది. 12,000 లైక్‌లు రాగా 1,300 మంది రీట్వీట్‌ చేశారు.

భారతీయుడిని కాబట్టి ఖరీదైన టికెట్‌ కొన్నానంటూ సతీశ్‌ షా జవాబు చెప్పడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. బ్రిటిషర్లు భారత్‌ను 200 ఏళ్లపాటు పాలించకపోతే ఇప్పుడు భారతీయులకు ఇంగ్లాండ్‌ ఒక కాలనీగా మారి ఉండేదని ఓ నెటిజన్‌ అభిప్రాయపడ్డారు. సతీశ్‌ షా ను హిత్రూ విమానాశ్రయం ట్విట్టర్‌లో క్షమాప ణ కోరింది. ఆ సంఘటనకు సంబంధించిన ఇతర వివరాలు        ఉంటే ఇవ్వాలని విన్నవించింది.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top