మాస్కో: క్రిమియా ద్వీపకల్పం మీదుగా వెళ్తున్న సమయంలో రష్యాకు చెందిన ఆంటోనోవ్ ఏఎన్-26 సైనిక విమానం కుప్పకూలిపోయింది. దీంతో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాలను టాస్ వార్తా సంస్థ బుధవారం ప‍్రచురించింది.
“మార్చి 31న సాయంత్రం 6 గంటలకు ఏఎన్-26 సైనిక రవాణా విమానంతో కమ్యూనికేషన్ కోల్పోయాం” అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెస్క్యూ టీమ్ ఏఎన్-26 విమానం కూలిన ప్రదేశాన్ని గుర్తించింది.
సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రాథమికంగా తెలిపింది. ఆ విమానం ఓ కొండ అంచును ఢీకొని కూలిపోయిందని పలు రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. సైనిక విమానం కుప్పకూలడం వెనుక ఉన్న కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు.
మీడియా అడిగిన ఇతర వివరాలపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిస్పందించలేదు. ఏఎన్-26 విమానం 1960 దశకం చివర నుంచే సర్వీసులో ఉంది. ఈ మోడల్‌ను సరుకు రవాణా కోసం ఎయిర్‌లైన్స్ కూడా ఉపయోగించాయి.
గత దశాబ్దంలో ఈ మోడల్‌కు విమానాలు పలు ప్రమాదాలకు గురయ్యాయి. 2022లోఘుక్రెయిన్ దక్షిణ-తూర్పు జపోరిజ్జియా ప్రాంతంలో విమాన ప్రయాణం సమయంలో ఉక్రెయిన్‌కు చెందిన ఏఎన్-26 కూలి ఒకరు మరణించారు. 2020లో ఉక్రెయిన్ ఉత్తర-తూర్పు ప్రాంతంలో శిక్షణ విమాన ప్రయాణం సమయంలో అది కూలి 26 మంది మృతి చెందారు.


