గంటలోపు నిందితుడి అరెస్ట్
బన్సీలాల్‌పేట్: సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీ పార్థివాడలోని శ్రీ అడవి మైసమ్మ దేవాలయంలో దొంగలు పడ్డారు. సోమవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని చోరీ చేశాడు. దీంతో గాంధీనగర్ పోలీసు అధికారులు దేవాలయాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు.అడిషినల్ డీసీపీ నర్సయ్య ఆలయాన్ని సందర్శించారు. స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి గంటలోపే నిందితుడిని అరెస్టు చేసి విగ్రహాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేశారు. మంగళవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించన్నట్లు దేవాలయం ప్రతినిధులు చెప్పారు. నిందితుడు గోల్కొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని..ఆటోలో వచ్చి చోరీ చేశాడని పోలీసులు గుర్తించారు.


