నాటు తుపాకీ విక్రయించేందుకు యత్నం | - | Sakshi
Sakshi News home page

నాటు తుపాకీ విక్రయించేందుకు యత్నం

Apr 21 2026 6:25 AM | Updated on Apr 21 2026 6:25 AM

నటి అనసూయపై అసభ్య పోస్టులు.. వ్యక్తి అరెస్ట్‌

ఇద్దరి అరెస్ట్‌

కుత్బుల్లాపూర్‌: నాటు తుపాకీ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని శేరిలింగంపల్లి ఎస్‌ఓటీ, పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సవవవేశంలో కుత్బుల్లాపూర్‌ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. నాటు తుపాకీ విక్రయిస్తుననారని పోలీసులకు సమాచారం అందింది. దూలపల్లిలోని వికాస్‌ గ్యాస్‌ గోదాము వద్ద నిఘా పెట్టగా అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరిని ఆదుపులోకి తీసుకొని విచారించగా తుపాకీ విక్రయం వ్యవహారం బయట పడింది. నిందితులు బీహార్‌కు చెందిన వికాస్‌కుమార్‌(22), వంశరాజ్‌(31) గా గుర్తించారు. వీరు స్థానికంగా కూలీలుగా పనిచేచేస్తున్నారు. బిహార్‌లో తుపాకీ కొనుగోలు చేసి సిటీలో విక్రయించాలని ప్లాన్‌ వేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.7.65 ఎంఎం నాటు తుపాకీతోపాటు 8 బుల్లెట్లు, రెండు ఖాళీ మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో ఎవరెవరికి ఆయుధాలను విక్రయించారనేది దర్యాప్తులో తేలుతుందన్నారు.

పరీక్షలు రాస్తూ.. చోరీలు చేస్తూ..

ముగ్గురు టెన్త్‌ విద్యార్థుల అరెస్ట్‌

మూసాపేట: పదవ తరగతి పరీక్షలు రాస్తూనే బైక్‌ దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన మేరకు.. కూకట్‌పల్లికి చెందిన ముగ్గురు బాలురు కూకట్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నారు. జల్సాలకు అలవాటు పడ్డ వీరు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న సమయంలోనే కూకట్‌పల్లి బాలాజీనగర్‌ ఫ్రీడమ్‌ పార్కు, సప్తగిరి కాలనీ, గాయత్రినగర్‌, బాలాజీనగర్‌లో పార్కింగ్‌ చేసి ఉన్న వాహనాలను దొంగతనం చేశారు. కూకట్‌పల్లి బస్‌స్టాప్‌ వద్ద డిటెక్టివ్‌ ఎస్‌ఐ రవీందర్‌ రెడ్డి నేతృత్వంలో పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా అనుమానంగా కనిపించిన వీరిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ద్విచక్రవాహనాలు మాయం చేసినట్లు ఒప్పుకున్నారు.వారి వద్ద నుంచి నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకుని ముగ్గురినీ సోమవారం జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియాలో నటి అనసూయ భరద్వాజ్‌ను ఉద్దేశించి అసభ్యకర పోస్టులు పెట్టిన నిందితుడిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నల్లగొండ జిల్లా అల్వాల గ్రామానికి చెందిన దోరేపల్లి చంటిగా గుర్తించామని డీసీపీ టి.సాయి మనోహర్‌ సోమవారం ప్రకటించారు. గత ఏడాది డిసెంబర్‌ 23 నుంచి పలువురు వ్యక్తులు సోషల్‌మీడియా పేజీల్లో నటి అనసూయ భరద్వాజ్‌పై అనుచిత, అసభ్యకర పోస్టు చేస్తున్నారు. దీనిపై అనసూయ ఫిర్యాదుతో సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు చంటిని అరెస్టు చేశారు. ఇతడు తన ఇన్‌స్టా ఖాతాలో అసభ్యకర వ్యాఖ్యలు పోస్టు చేసినట్లు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement