వేర్వేరు చోట్ల ముగ్గురి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు చోట్ల ముగ్గురి బలవన్మరణం

Apr 21 2026 6:25 AM | Updated on Apr 21 2026 6:25 AM

సంతానం లేదని గృహిణి..

రాజేంద్రనగర్‌ : బండ్లగూడ ఎన్‌ఎఫ్‌సి కాలనీలో శివ, సుమలత (36) దంపతులు నివాసముంటున్నారు. అనారోగ్య సమస్యలతో పాటు సంతానం కలగలేదని తరచూ సుమలత బాధపడేది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేరు సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పంచానామ నిర్వహించి బృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్‌ ఎస్‌ఐ రాఘవేందర్‌ తెలిపారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి..

మల్కాజిగిరి: న్యూ వెంకటేశ్వరనగర్‌కు చెందిన కోడాటి మధుమోహన్‌(41) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మధుమోహన్‌ పై గృహహింస కేసు ఉండడంతో పెద్ద మనుషులు సర్దిచెప్పారు. ఈ నెల 19వ తేదీ మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరగగా కవిత పిల్లలతో కలిసి తుకారాంగేట్‌లో పుట్టింటికి వెళ్లింది. 20న మధుమోహన్‌ పనిచేసే సంస్థలో ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. స్పందించకపోవడంతో ఇంటికి వెళ్లి చూశారు. కిటికీకి తాడుతో ఉరి వేసుకున్నట్లు గమనించి అతని సోదరుడు కనకేష్‌కు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు.

ఎన్‌బీటీనగర్‌లో విద్యార్థి..

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ ఎన్‌బీటీనగర్‌లో నివసించే దంతాల సంజయ్‌కుమార్‌ (23) హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తున్నాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌–4లోని జీవీకే మాల్‌ ఎదురుగా హెబిటట్‌ కేఫ్‌లో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నాడు. కొంతకాలంగా ముభావంగా ఉంటూ కుటుంబ సభ్యులతో ఎక్కువగా మాట్లాడడం లేదు. సోమవారం మధ్యాహ్నం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంజారాహిల్స్‌ సెక్టార్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.

కుటుంబసమస్యలు, వ్యక్తిగత కారణాలతో నగరంలో పలుచోట్ల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. రాజేంద్రనగర్‌, మల్కాజిగిరి,బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఈ సంఘటనలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement