ఏజీవర్సిటీ: రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) డైరెక్టర్ జనరల్‌గా సంజయ్ కుమార్ అగర్వాల్ సోమవారం బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా సిబ్బంది సంజయ్ కుమార్‌కు అభినందనలు తెలిపారు.
నారాయణ స్కూల్ గేట్‌కు తాళం
మేడిపల్లి: బోడుప్పల్‌లోని నారాయణ స్కూల్ ప్రధాన గేటుకు భవన యజమానులు సోమవారం తాళం వేశారు.ఒప్పందం ముగియడం వల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు భవన యజమానులు చెబుతున్నారు.అయితే 2027 మార్చి వరకు ఒప్పందం ఉందని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. దీంతో వివాదం మరింత ముదిరింది. ఇదే సమయంలో గ్లోబల్ మైండ్ స్కూల్ యాజమాన్యం తాము పదేళ్ల లీజుకు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇరువర్గాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.


